calender_icon.png 6 May, 2025 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీడియో కాల్ ద్వారా గర్భిణికి నర్సుల వైద్యం

06-05-2025 12:36:16 AM

వైద్యం వికటించి కవలపిల్లలు మృతి

ఇబ్రహీంపట్నం విజయలక్ష్మి హాస్పిటల్‌లో ఘటన

హాస్పిటల్‌పై కఠినచర్యలు తీసుకోవాలని బంధువుల డిమాండ్

ఇబ్రహీంపట్నం, మే 5: పురిటినొప్పులతో గర్భిణి హాస్పిటల్‌కు రాగా, వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో ఆస్పత్రిలోని నర్సులు డాక్టర్‌కు వీడియో కాల్ చేసి గర్భిణీకి ట్రీట్‌మెంట్ చేశారు.. వైద్యం వికటించడంతో కవలపిల్లలు మృతిచెందారు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలో జరిగింది.

ఎలి మినేడుకు చెందిన బుట్టి గణేశ్ దంపతు లు ఇబ్రహీంపట్నంలోని మంచాల రోడ్‌లో ఉన్న విజయలక్ష్మి హాస్పిటల్‌లో కాన్పు కోసం, పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చా రు. ఆ సమయంలో డాక్టర్ అందుబాటులో లేడు. కీర్తికి నొప్పులు మరింత ఎక్కువవడం తో నర్సులు వాట్సాప్‌లో డాక్టర్‌కు వీడియో కాల్ చేశారు. అతడి సూచనల మేరకు నర్సు లు గర్భిణీకి ఆపరేషన్ చేశారు.

వైద్యం వికటించి తీవ్ర రక్తస్రావమైంది. దీంతో కవల పిల్లలిద్దరూ మృతి చెందారు. హాస్పిటల్ వద్ద బాధితులు, వారి బంధువులు ఆందోళన చేపట్టారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్ప త్రి యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కీర్తి భర్త గణేశ్ మాట్లాడుతూ.. వైద్యుల నిర్లక్ష్యంతోనే పిల్లలు మృతి చెందారని ఆరోపించారు.

ఉదయం 4 గంటలకు డాక్టర్‌కు సమాచారమిస్తే వాట్సాప్ వీడియో కాల్ ద్వారా సిస్టర్ రాజ్యలక్ష్మికి చూయించామని, ఆమె వైద్యం చేశారన్నారు. వైద్యం వికటించి పిల్లల చనిపోయినా కూడా తమతో రూ.30 వేలు ఫీజు కట్టాలని ఆస్పత్రి యజమాన్యం డిమాండ్ చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బంధువుల ఆందోళనతో విషయం తెలుసుకున్న పోలీసులు నర్సులు, డాక్టర్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం అధికారులు హాస్పిటల్‌ను సీజ్ చేశారు.