calender_icon.png 9 May, 2025 | 10:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూతురుతో అసభ్యంగా ప్రవర్తించిన తండ్రికి మూడు ఏళ్ల జైలు శిక్ష

14-03-2025 01:06:53 AM

జగిత్యాల, మార్చి 13 (విజయక్రాంతి): జగిత్యాల రూరల్  పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన మేకల స్వామి అనే వ్యక్తి మైనర్ బాలికైన తన కన్న కూతురుతో అసభ్యంగా  ప్రవర్తించిన కేసులో జిల్లా జడ్జి నీలిమ గురువారం 3 ఏళ్ల జైలు శిక్షతో పాటూ రూ. 5 వేలు జరిమాన విదిస్తూ తీర్పునిచ్చారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో అప్పటి ఎస్‌ఐ చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి, ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుకి ఆధారాలు సమర్పించారు. సాక్ష్యులను విచారించిన న్యాయమూర్తి నీలిమ నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 5 వేలు జరిమాన విదిస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసులో నిందితునికి శిక్ష పడటంలో కృషి చేసిన పీపీ రామకృష్ణరావు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చిరంజీవి , సిఎంఎస్  ఎస్‌ఐ శ్రీకాంత్, కోర్టు కానిస్టేబుల్ నరేష్, సిఎంఎస్ కానిస్టేబుల్లు శ్రీధర్, కిరణ్’కుమార్లను ఎస్పీ అశోక్’కుమార్ అభినందించారు.