calender_icon.png 15 December, 2025 | 7:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొడుకుపై తండ్రి విజయం

15-12-2025 02:14:14 AM

మెదక్ జిల్లా ఝాన్సిలింగాపూర్‌లో ఓటర్ల తీర్పు

రామాయంపేట, డిసెంబర్ 14: మెదక్ జిల్లా రామాయంపే ట మండలం ఝాన్సిలింగాపూర్ గ్రామ పం చాయతీ ఎన్నికల్లో తండ్రీకొడుకు హోరాహోరీగా పోటీ పడ్డారు. గ్రామంలో ఆయుర్వేదిక్ డాక్టర్‌గా పేరుగాంచిన మానెగల్ల రామకృష్ణయ్య కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థిగా పోటీ లో ఉన్నారు. తన కుమారుడు మానెగల్ల వెంకటేశ్ బీజేపీ బలపర్చిన అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఒకే కుటుంబం నుంచి తండ్రి, కొడుకులు పోటీ పడటంతో ఎన్నిక రసవత్తరంగా సాగింది. చివరికి కొడుకుపై తండ్రి విజయం సాధించారు. కొడుకు వెంకటేశ్‌పై 99 కోట్ల మెజార్టీతో తండ్రి రామకృష్ణయ్య గెలుపొందారు.