14-11-2025 01:23:44 AM
మొయినాబాద్, నవంబర్ 13( విజయక్రాంతి): సురంగల్ మున్సిపాలిటీ ప్రజలకు వీధి కుక్కల భయం పట్టుకుంది. వృద్ధులు, చిన్నారులు అడుగు తీసి అడుగు వేయాలంటే ఎక్కడ వీధి కుక్కలు దాడి చేస్తయో అని బయటికి రావాలంటేనే జంకుతున్నారు.
కుక్కల బారిన పడి చిన్నారులు, వృద్ధులు,మహిళలు గాయాల ఫాలో అవుతున్న మున్సిపల్ అధికారులకు పట్టింపు లేదు. ఎక్కడ పడితే అక్కడ గుంపులు, గుంపులు గా సంచరిస్తూ ముక్కుమ్మడిగా దాడులకు పాల్పడుతున్నాయని పలువురు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టింపేలేదని మున్సిపాలిటీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధి లో ని సురంగల్ లో దాదాపు గా 400 లకుపై బడే కుక్కలు ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. వీధి కుక్కలు ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తారో అని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఉదయం సాయంత్రం వేళలో, వ్యక్తిగత పనుల నిమిత్తం బయటికి వెళ్లే వారి పైన కుక్కలు మూకుముడిగా పడి దాడి చేస్తున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాలలో పట్టుకు వచ్చిన కుక్కలను గ్రామ సమీపంలో వదిలి వెళ్ళడంతో సమస్య మరీ ఎక్కువైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు కూడా వీధి కుక్కల సమస్యలను పరిష్కరించలేక పోతున్నారని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నే సుప్రీం కోర్ట్ వీధి కుక్కలపై గైడ్లున్స్ విడుదల చేసిందని... సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మున్సిపాలిటీలో కుక్కల బెడద లేకుండా చేయాలని స్థానిక ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు.