calender_icon.png 14 September, 2025 | 6:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లిపాలపై భయాందోళనలు

16-08-2024 12:00:00 AM

అమృతం కన్నా మిన్నగా భావించే ‘తల్లిపాలు’ ఇప్పుడు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. చిన్నారులు జీవి తాంతం ఆరోగ్యంగా ఉండాలంటే పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టించాలి. కానీ, ఆ పా లు కాస్తా కలుషితమవుతున్నాయంటే బాధాకరమైన విషయం. విచ్చలవిడిగా పెరిగి న ప్లాస్టిక్ వాడకం చివరకు తల్లిపాలకు శా పంగా పరిణమించింది. ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ ప్ర తి పనిలో, ప్రతి చోటా ప్లాస్టిక్ వాడకం పెరిగిపోవడం తల్లిపాలపై ప్రభావం చూపిస్తు న్నది. ప్లాస్టిక్ బ్యాగులు, డబ్బాలు, ఆహార పదార్థాల పార్సిళ్లు, వాటర్ బాటిళ్లు తదితరమైనవి వాడటం వల్ల అతిసూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు శరీరంలోకి ప్రవేశిస్త్తున్నాయి. దీంతోపాటు పెరుగుతున్న వాతావరణ కా లుష్యం మధ్య జీవనం తల్లిపాలకు ప్రమాదకరంగా మారుతున్నది.

అమృతంతో సమానం

సృష్టిలో స్వచ్ఛమైన పదార్థమంటే ట క్కున మనకు గుర్తొచ్చేవి అమ్మపాలు. ఇవి బిడ్డకు ఎంతో మేలు చేస్తాయి. ఆరు నెల లు వచ్చేవరకు శిశువుకు పట్టించడం ఎదుగుదలకు ఎంతగానో దోహద పడుతుంది. చనుబాలలోని ‘మేయో ఇనాసిటోల్’ అనే చక్కెర శిశువుల మెదడు ఎదుగుదలకు గ ణనీయంగా తోడ్పడుతుంది. పుట్టినప్పటి నుంచీ మెదడులో అనుసంధానాలు ఏర్పడుతూ, మెరుగవుతూ వస్తుంటాయి. ఇం దుకు జన్యు, పర్యావరణ పరమైన అంశాలతోపాటు జీవితంలో ఎదురయ్యే అనుభ వాలు దారి చూపుతాయి. అలాగే, పాలలో ని సూక్ష్మ పోషకాలు శిశువులో ముఖ్య భూమికను పోషిస్తాయి. తొలి నెలల్లో తల్లిపాల లో మేయో -ఇనాసిటోల్ పెద్ద మొత్తంలో ఉంటాయిని టఫట్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఈ సమయంలోనే శి శువుల మెదడులో నాడీ అనుసంధానాలు (సినాప్సెస్) చాలా వేగంగా ఏర్పడుతాయి. నాడులమధ్య వీటి పరిమాణం, సంఖ్య పెరగడానికి మేయో- ఇనాసిటోల్ తోడ్పడుతున్నట్లు వారు తెలిపారు. రక్తంలోని హాని కారకాలు మెదడులోకి చేరకుండా అడ్డుకు నే బ్యారియర్ బిడ్డ పుట్టిన తొలినాళ్లలో స మర్థవంతంగా పనిచేయదు. అందువల్ల ఆ హారానికి శిశువు మెదడు చాలా ఎక్కువగా స్పందిస్తుండ వచ్చని వారు భావిస్తున్నారు. అలాగే, తల్లిపాలలో క్యాలరీలు, కొ వ్వులు, కొలెస్ట్రాల్, సోడియం, పొటాషియం, పిం డి పదార్థాలు, విటమిన్- సి, కాల్షియం, ఇ నుము, మెగ్నీషియం, విటమిన్- డి, బి12.. ఇలా చాలా పోషకాలు పుష్కలంగా లభిస్తా యి.

శిశువు ఎదుగుదలకు కీలక పాత్ర పో షించే లాసిన్ అమైనో ఆమ్లాలు తక్కువ బ రువుతో పుట్టిన పిల్లలకు కీలకంగా మారుతాయి. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడానికి తల్లి పాలు ప్రధాన వనరుగా ఉం టాయి. తల్లిపాలు తాగే శిశువుల్లో సమతూకమైన బ రువు సమకూరుతుంది. పెరిగే పిల్లలకు భవిష్యత్తులో డయాబెటిస్, ఒ బెసిటీ సమస్యలు రాకుండా ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి, శి శువు పుట్టిన నాటినుంచీ ఏడాదిన్నరపాటు తల్లిపాలు పట్టించడం అన్ని విధాల శ్రేయస్కరం.

బోసినోటికి అందని స్తన్యం

పుట్టిన చాలామంది శిశువుల బోసినోటికి తల్లి స్తన్యం అందడం లేదు. అత్యధిక శాతం మంది నవజాత శిశువులు అమృత తుల్యమైన తల్లిపాలను కోల్పోతున్నారు. 67.5 శాతం మంది శిశువులు తొలిగంట తల్లిపాలకు నోచుకోవడం లేదు. కేవలం 23.2 శాతం మంది శిశువులకే తొలిగంటలో పాలు పడుతుండగా, 9.2 శాతం మంది అసలు తల్లిపాలకు నోచుకోవడంలేదు. ప్రసవమైన తొలి గంటలో తల్లి పాల లో శిశువుకు రోగ నిరోధక శక్తిని పెంపొందించే పోషకాలు అధికంగా ఉంటాయి. కా నీ, అవగాహనా లోపం కారణంగా చాలామంది తల్లులు తమ పిల్లలకు ఈ పాలను అందించడం లేదు.

తెలుగు రాష్ట్రాలతోపాటు పలు రాష్ట్రాల్లో తల్లిపాలపట్ల ఆసుప త్రులు, తల్లులు జాగ్రత్తలు తీసుకోవడం లే దని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) గుర్తించింది. కాన్పు తర్వాత చనుబా లు రావడం లేదని బిడ్డకు పాలు పట్టించ డం మానేస్తున్నట్లు సంస్థ పరిశీలనలో తే లింది. బిడ్డతో చనుబాలు తాగించే అలవా టు చేస్తే మొదటి 10 నిమిషాల్లో ముర్రుపాలు రాకపోయినా తర్వాత వస్తాయని వై ద్యులు చెబుతున్నారు. ఈ ప్రయత్నమూ చేయకుండా పోతపాలుగానీ, పటిక బెల్లం, తేనె కలిపిన నీటిని పట్టించేస్తున్నారని తే లింది. ఆసుపత్రి కాన్పుల్లో 80 శాతం మం దిలో 50 శాతం మొదటి గంటలో ముర్రుపాలు పట్టిస్తుండగా, ఇవి అందని 30 శా తం మందిలో 22 శాతం శిశువులు మరణించడమో, వివిధ రకాల వ్యాధులకు గురవడమో జరుగుతున్నట్లు ఎన్‌ఐఎన్ పరిశీలనలో తేలింది.

హ్యూమన్ మిల్క్ బ్యాంకులు

తల్లిపాలకు దూరమవుతున్న పిల్లల ఆక లి తీర్చడానికి ‘హ్యూమన్ మిల్క్ బ్యాంకు’ లు అందుబాటులోకి వచ్చాయి. నవజాత శిశువులకు చనుబాలు దానం చేసిన మా తృమూర్తి ఏకంగా గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది. అమెరికాలోని ఒరెగాన్‌కు చెం దిన ఎలిసొబెత్ అండర్సన్ సియెర్రా తన ఇద్దరు పిల్లలకు పాలు పట్టడంతోపాటు 2015 నుంచి 2018 మధ్యలో 1,600 లీట ర్ల తన చనుబాలను పాల బ్యాంకులకు వి రాళంగా అందించి గిన్నిస్ గుర్తింపు పొం దింది. కేరళలో తొలి తల్లిపాల బ్యాంకు ఎ ర్నాకులం ప్రభుత్వ ఆసుపత్రిలో 2021లో ఏర్పాటైంది.

సేకరించిన పాలను అనారోగ్యంగా ఉన్న చిన్నారులకు, తల్లిని కోల్పో యిన శిశువులకు పట్టిస్తున్నారు. ఆరు నెలలపాటు పాలను నిల్వ ఉంచేలా ఈ బ్యాం కును ఆధునిక సౌకర్యాలతో ఏర్పరిచారు. తమిళనాడుకు చెందిన ఓ మహిళ 10 నెల ల్లో 55 లీటర్ల చనుబాలను సేకరించి శిశువులకు దానం చేసి ఆదర్శంగా నిలిచారు. హైదరాబాద్‌లో తొలి హ్యూమన్ మిల్క్ బ్యాంకును నీలోఫర్ పిల్లల ఆసుపత్రిలో ఏడేళ్ల క్రితమే ఏర్పాటు చేశారు. ప్ర స్తుతం నగర వ్యాప్తంగా అర డజనుకుపైగా మిల్క్ బ్యాంకులు అందుబాటులోకి వచ్చి శిశువులకు అమ్మపాల కొరతను తీరుస్తున్నాయి.

తల్లిపాలల్లో మైక్రో ప్లాస్టిక్స్

ప్రస్తుతం తల్లిపాలలో మైక్రోప్లాస్టిక్స్‌ని కనుగొన్నామని శాస్త్రవేత్తలు చెబుతుండడంతో సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. బిడ్డలకు జన్మనిచ్చిన వారం రోజులకు ఇటలీలో 34 మంది ఆరోగ్యవంతమైన తల్లుల పాలను సేకరించి పరిశీలించగా మూడొంతులమంది తల్లుల పాలలో మైక్రో ప్లాస్టిక్స్ అవశేషాలున్నట్లు రెండేళ్ల క్రితం గుర్తించారు. ఇది చిన్నారుల మెదడు, నాడీ మండలంపై ప్రభావం చూపడంతోపాటు హార్మోన్ల అసమతుల్యతకు దారి తీయవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. తల్లిపాలలోని మైక్రో ప్లాస్టిక్స్‌ద్వారా జరిగే దుష్పరిణామాలపై ఎలాంటి రుజువులు లేవని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) స్పష్టం చేసినప్పటికీ, ప్రమాదకర మైక్రో ప్లాస్టిక్స్ పట్ల ప్రపంచ మానవాళి జాగరూకతతో ఉండాల్సి అవసరమేర్పడింది.

 కోడం పవన్ కుమార్

సెల్:9848992825