calender_icon.png 2 January, 2026 | 6:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నదాత అయోమయం!

02-01-2026 12:00:00 AM

ప్రయోగాత్మకంగా ఫర్టిలైజర్ యాప్ అమలు

భూ సమస్యలున్న వాటికి, కౌలు రైతులకు ఇక్కట్లు

ప్రయోజనాలు ఉన్నాయంటున్న ప్రభుత్వం

రైతుపై సాంకేతిక భారమనే విమర్శలు

సంగారెడ్డి, జనవరి 1(విజయక్రాంతి): యూరియా బుకింగ్ యాప్ పై వ్యవసాయాధికారులు రోజుకో ప్రకటన చేసి అన్నదాత లను అయోమయానికి గురి చేస్తున్నారు. కొత్త వెర్షన్ల పేరుతో వారిని తికమక పెడుతున్నారు. రైతులు ఇప్పటికే రెండుసార్లు యాప్ డౌన్ లోడ్ చేసుకోగా అది కేవలం 14 నిమిషాలు మాత్రమే పని చేసింది. అయితే ఇప్పు డొచ్చిన కొత్త యాప్ కూడా పని చేయకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇం కెన్నిసార్లు యాప్ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుందోనని అసహనం వ్యక్తం చే స్తున్నారు.

యాప్ పద్దతి వద్దంటూ మళ్లీ డీ లర్లు, సొసైటీల వద్దకు వెళ్లి యూరియా బస్తాలను కొనుగోలు చేస్తున్నారు. రైతులకు సులభంగా యూరియా సేవలు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం యూరియా బుకింగ్ యాప్ రూపొందించింది. డిసెంబర్ 20వ తేదీ నుంచి సేవలు ప్రారంభించగా డౌన్లోడ్ చేసుకున్న రైతులకు ఆదిలోనే ఇ బ్బందులు ఎదురైన సంగతి తెలిసిందే. యా ప్లో లోపాలను సరిదిద్దుతూ ప్రభుత్వం అదే నెల 28వ తేదీన కొత్త వెర్షన్ ను అందుబాటులోకి తెచ్చింది. దీనిని రైతులు డౌన్లోడ్ చే సుకునేలా చూడాలని అన్ని మండలాల వ్యవసాయాధికారులకు, సొసైటీల అధికారులకు సూచించింది. వారు సామాజిక మాధ్య మాల్లో సందేశాలు పంపించగా కొత్త వెర్ష న్ను రైతులు డౌన్లోడ్ చేసుకున్నారు.

అదికూ డా ఇప్పుడు పని చేయడం లేదు. అర్థంకాని పరిస్థితిపై రైతులు వ్యవసాయాధికారులను ప్ర శ్నిస్తున్నారు. అధికారులు కూడా రైతులకు ఎలాంటి స్పష్టత ఇవ్వాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. కాగా ఫర్టిలైజర్ యాప్ పై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతుండగా, అధికార పార్టీ మాత్రం రైతులకు ఇది ప్రయోజనం కలిగిస్తుందని, స మయం వృథా కాకుండా ఉంటుందని పే ర్కొంటుంది. అయితే మామూలు ఫోన్లు వి నియోగించే రైతులు స్మార్ట్ ఫోన్ కు మారాల్సిన పరిస్థితి. ఇప్పటికే పత్తి విక్రయించేందు కు స్లాట్ బుకింగ్ విధానం తీసుకురాగా, తా జాగా ఎరువుల కొనుగోలు కోసం యాప్ తీ సుకురావడం ద్వారా రైతులపై సాంకేతిక భా రం పడుతుందనే విమర్శలున్నాయి. మరోవైపు భూ సమస్యలు ఉన్న వారు, కౌలు రై తులకూ ఇక్కట్లు తప్పడం లేదని తెలుస్తోంది.

సమస్యలు ఇలా..

రెవెన్యూ పట్టా, ఆర్‌ఎస్‌ఆర్ పట్టా ఉన్న గి రిజన, నాన్ డిజిటల్ సైన్లో ఉన్నటువంటి పో రంబోకు, పార్ట్(బి) సమస్యలు ఉన్న వ్యవసా య భూములు, కౌలు రైతులకు ఈ యాప్ ద్వారా బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతుంది. అ యితే భూ సమస్యలున్న రైతులతో పాటు కౌలుదారులకు ఈ యాప్ వినియోగం అ నుకున్నంత సులువు కాదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతిక సమస్యల కార ణంగా వారు ఎరువును అందుకోలేని పరిస్థితి ఉందని రైతు సంఘాల నాయకులు పే ర్కొంటున్నారు. వీటన్నింటిని పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.