calender_icon.png 4 October, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చేయాలి

04-10-2025 12:48:31 AM

టీఎన్‌టీయుసీ రాష్ట్ర నాయకులు పోటు రంగారావు

మణుగూరు, అక్టోబర్ 3,( విజయక్రాంతి):స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. శుక్రవారం టీడీపీ నేత మద్దెల భద్రయ్య  అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమా వేశం నిర్వహించారు. ఈసందర్భం  ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో టీడీపీ తన మార్కు ను చూపించాలని, కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేసి  సర్పంచ్, ఎంపిటిసి స్థా నాల్లో పోటీ చేసిపార్టీ విజయానికి పాటుపడాలన్నారు.

అన్ని  పంచాయతీలు, ఎంపిటిసి స్థానా ల్లో పోటీ చేసేందుకు టిడిపి సిద్ధమైనట్లు తెలిపారు.  యూనియన్ ప్రెసిడెంట్ కనక మెడల హరి ప్రసాద్ అశ్వాపురం మండల నాయకులు తుళ్లూరు ప్రకాష్, బూర్గంపాడు మండల నాయకులు జగదీశ్వరరావు తోట వెంకటేశ్వర్లు, గల్లా నాగభూషణం, కాకర్ల సత్యనారాయణ, పాయం లక్ష్మీనారాయణ  టౌన్ అధ్యక్షులు ఎలమటి పూర్ణ  కరీమునిషా బేగం, వాసు, రామకృష్ణ, మిడిదొడ్ల వెంకటేశ్వర్లు, రామ్ ఎల్లయ్య శ్రీను పాల్గొన్నారు.