19-01-2026 12:32:16 AM
ఎన్టీఆర్ స్టేడియంలో నేటి నుంచి ఐదు రోజులపాటు
కలెక్టర్ చొరవతో ఏర్పాట్లు పూర్తి
నిర్మల్, జనవరి 18 (విజయక్రాంతి): నిర్మల్ చరిత్ర సంప్రదాయాలు కలలు సాంస్కృతిక నాగరికత తెలిపేందుకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధ్వర్యంలో నిర్మల్ ఉత్సవాలను రెం డవసారి నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు నిర్మల్ ఉత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిర్మల్ ఉత్సవాల నిర్మాణపై ఇప్పటికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఈనెల 16న బ్రోచర్లను విడుదల చేశారు.
జిల్లాలోని 52 ప్రభుత్వ శాఖల సమన్వయంతో నిర్మల్ చరి త్ర, చారిత్రాత్మక కట్టడాలు ప్రదేశాలు జీవనదులు సాగు విధానం చారిత్రాత్మక కళలు. ప్రాచీన వంటలు ఆహారపు అలవాట్లు జాతీ య అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ప్రముఖుల జీవితాల చరిత్ర కవులు రచయితలు సామాజికవేత్తలు విద్యావేత్తల టూరిజం ప్రదేశాలు ప్రాచీన దేవాలయాలు తదితర అంశాలను ప్రధానంగా చేసుకొని నిర్మల్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
గత సంవత్సరం మొట్టమొదటిసారిగా ఈ ఉత్సవాలు నిర్వహించగా పెద్ద ఎత్తున విద్యార్థులు యువకులు, రైతులు ప్రజ లు తరలివచ్చి నిర్మల్ జిల్లా చారిత్రాత్మకతను తెలుసుకునే అవకాశం దక్కింది అప్పట్లో నిర్మ ల్ ఉత్సవాలు తెలంగాణ రాష్ట్రంలోనే గొప్ప గుర్తింపు పొందాయి. ఐదు రోజులపాటు నిర్వహించే యుత్సవాల్లో స్టాళ్లు వంటకాలు సాంస్కృతిక ప్రదర్శనలు గ్రామీణ కలలు తదితర అంశాలను రోజు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
చరిత్రను భావితరానికి అందించేందుకు: కలెక్టర్
నిర్మల్ పట్టణంలో రెండవసారి నిర్వహిస్తున్న నిర్మల ఉత్స వాల ప్రాధాన్యతను కలెక్టర్ అభిలాష అభినవ్ వివరించా రు. తెలంగాణలో నిర్మల్ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉందని ఇక్కడ నిర్మల్ కోటలు కొయ్య బొమ్మ లు సయాది పర్వతాలు ప్రాచీన దేవాలయాలు శిల్ప కళలు నేటి యువతరానికి తెలియజెప్పేందుకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు ఐదు రోజులపాటు నిర్వహించే ఉత్సవాలకు అన్ని శాఖల సమావేశం ముందుకు వెళుతున్నామని తెలిపారు ఈ ఉత్సవాలలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంత చేయాలని పిలుపునిచ్చారు.