calender_icon.png 4 December, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోరు.. హుషారు..!

04-12-2025 01:04:51 AM

  1. పలు పంచాయతీలలో బహుముఖ పోటీ

పాపన్నపేటలో ఆరు పంచాయతీలు ఏకగ్రీవం

పాపన్నపేట, డిసెంబర్ 3 :పల్లె సంగ్రా మం సందర్భంగా మొదటి విడతలో నిర్వహించనున్న ఎన్నికల ప్రక్రియ చివరి అంకా నికి చేరుకుంది. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం బుధవారం ముగిసింది. స్థాని క సం స్థల ఎన్నికల బరిలో మిగిలిన వారెవరో లెక్క తేలింది. మండలంలోని 40 గ్రా మ పంచాయితీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా గ్రామ పంచాయితీలో అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు.

నామినేషన్ల ఉప సంహరణ గడువు బుధవారంతో ముగియడంతో పోటీలో ఉన్న అభ్య ర్థుల జాబితాతో పాటు వారికి గుర్తులు కేటాయిస్తూ ఎన్నికల అధికారులు వివరాలు వెల్లడించారు. ఇక నుంచి ప్రచారం ఊపందుకోనుంది. ఎన్నిక ల ప్రచారంతో పల్లెల్లో రాజకీ య వేడి రాజుకోనుంది. జనరల్ స్థానాల్లో పోటీ రసవత్త రంగా మారనుంది. సర్పంచి పదవిని కైవ సం చేసుకోవడానికి పావులు కదుపుతున్నా రు.

ఎన్నికలకు ఇంకా వారం రోజుల సమయమే ఉంది. ఫలితాలు ఎలా ఉంటాయోన ని ఓటర్లు కూడా ఆసక్తితో ఎ దురుచూస్తున్నారు. రాజకీయ పార్టీ నేతల ఉపసంహరణ చేయడానికి చేసిన ప్రయత్నాలు కొన్ని పంచాయితీల్లో విఫలమయ్యాయి. 

40 పంచాయతీలకు ఆరు ఏకగ్రీవం

మండలంలో 40 గ్రామపంచాయతీలు ఉండగా అందులో 6 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. నామాపూర్, మల్లంపేట, కందిపల్లి, అమ్రియా తాండ, యూ సుఫ్ పేట, లక్ష్మీ నగర్ గ్రామాల్లో సర్పంచి, వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. పలు పంచాయతీల్లో ద్విముఖం, త్రిముఖ, చతుర్ముఖ పోటీ నెలకొంది. మెజారిటీ గ్రామాల్లో అధికార పార్టీ నాయకుల మద్యే పోటీ నెలకొంది.

పాపన్నపేటలో కాంగ్రెస్ నుంచి ప్రధానంగా ఇద్దరు పోటీ పడుతున్నారు. ఎక్కువ ఓటర్లు ఉన్న పంచాయతీలో ఇదే తంతు నెలకొంది. పార్టీ రహితంగా గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ నేతల ప్రమేయం కాదనలేనిధి. ఇదిలా ఉంటే ఒకే పార్టీ నుంచి పలువురు పోటీ పడుతుండటంతో ఎవరు గెలిచినా ‘మన గూటి పక్షులే కదా‘.. అన్న భావన కూడా ముఖ్య నేతల్లో నెలకొంది.

దావత్ లు షురూ..

మండలంలోని ఆయా గ్రామపంచాయతీల్లో తడి పొడి దావతులు ప్రారంభమ య్యాయి. నిశి రాత్రిలో ’నిషా’ను తలకెక్కిస్తున్నారు. తమకు ఓటు వేయాలని వేడుకుం టున్నారు. ఐదు నుంచి పది ఓట్లు ఉన్న వా రి కుటుంబాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. పల్లె పోరు కావడంతో బలగం.. బల ం..

కులాలపై ఎన్నికలు సాగుతున్నాయి. రిజర్వేషన్ల లోని మెజారిటీ స్థానాలు తక్కువ ఖర్చుతోనే బయటపడే వీలుండగా జనరల్ స్థానాల్లోనే డబ్బుల పంపిణీకి తెరతీసే అవకాశం నెలకొంది. ఏది ఏమైనప్పటికీ మం చిని గెలిపించి.. పల్లెకు పండుగ చేద్దామని గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు కంకణబద్ధులై ఉన్నారు.