calender_icon.png 4 December, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోడౌన్లలో గోల్ మాల్!

04-12-2025 01:19:43 AM

  1. రాష్ట్రవ్యాప్తంగా రబీ ఖరీఫ్ సీజన్లో ఏటా రూ.150 కోట్ల అవినీతి

జాతీయ, రాష్ట్ర, వేర్ హౌస్ గోడౌన్లలో అవినీతి తిమింగలాలు

మిల్లర్ల నుంచి ముక్కుపిండి వందల కోట్ల అక్రమ వసూళ్లు

మిల్లర్లకు హమాలి ట్రాన్స్ పోర్టు బినామీ కాంట్రాక్టర్ల వేధింపులు కలెక్టర్ల ఆదేశాలు భేఖాతారు

నిజామాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): జాతీయ,రాష్ట్ర, ప్రవేట్ వేర్ హౌస్ గోడౌన్లలో తీవ్రస్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా దోపిడీ జరుగుతోంది.        నిజామాబాద్ జిల్లాలోని మిల్లర్ల నుండి ఆరోపణలు వస్తున్నాయి. ధాన్యాన్ని ఆడించి బియ్యాన్ని వేర్ హౌస్ గోడౌన్లోడ్ తరలిస్తున్న మిల్లర్లు తీవ్ర అగచాట్లకు గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లోని  రెండు సీజన్ లకు కలిపి మిల్లర్ల నుండి సుమారు రూ:150 కోట్ల వరకు ముక్కు పిండి వసూళ్లకు పాల్పడుతున్నారు.

ఈ విషయమై ఆయా జిల్లాల్లో కలెక్టర్ ల ఆదేశాలను కూడా భే ఖాతార్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో లోకేశ్వరం,ఉప్పల్వాయి, శుభోదయా వేర్ హౌస్ గోడౌన్లకు మిల్లర్లు బియ్యాన్ని తరలిస్తున్నారు. హమాలీ టెండర్లు పొందినవారు ప్రభుత్వ నిర్దేశం ప్రకారము మిల్లర్లు హమాలీ డబ్బులు చెల్లిస్తున్నప్పటికిని అదనంగా ఉప్పల్వాయిలో 7 రూపాయలు లోకేశ్వరంలో 6 రూపాయలు శుభోదయ లో 4 రూపాయలు బస్తాకు అదనంగా వసూలు చేస్తున్నారు.

కొందరు బడా మిల్లర్లు బినామీ కాంట్రారలను ఏర్పాటు చేసుకొని మిల్లర్ల వద్ద నుండి దబాయించి వసూళ్లకు పాల్పడుతున్నారు.  బినామీలు వారి వెనుక ఉన్న బడా వ్యాపారులు కుమ్మకై డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ వసూళ్లు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 150 కోట్లకు పైనే జరుగుతోందన్న విషయం వింటే ముక్కున వేలేసు కోక తప్పదు. వేర్ అస్ అసోసియేషన్ పెద్దమనుషులు బినామి కాంట్రాక్టర్ల చేత నిర్వహిస్తున్న శుభోదయ వేర్ హౌస్ ఒక్క ఏసీకే కు580 బస్తాలు కాగా ఒక్క ఏసీకే కు శుభోదయవేర్ హౌస్ లో అదనంగా 2,350 లోకేశ్వరం  3,500, ఉప్పల్వాయి వేర్ హౌస్4,000 అదనంగా వసూళ్లకు పాల్పడుతున్నారు.

ఈ  అక్రమ వసూళ్ల వల్ల మిల్లర్లపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. ఈ గోడౌన్లలో అదనపు వస్తువ అవకతవకలు జరగడానికి ముఖ్య కారణం గత 20 సంవత్సరాలుగా ఒకే వ్యక్తికి కాంట్రాక్టు వీటి నిర్వహణకు ఒకే అధికారి తిట్టేసి రెండు చేతుల అక్రమ అర్జున కు పాల్పడుతున్నట్టు మిల్లర్లు ఆరోపిస్తున్నారు. బడా రైస్ మిల్లర్లు మరోవైపు వేర్ హౌస్ బినామీల అక్రమాల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నట్టు మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా హమాలీ సాకుతో రోజుల తరబడి అన్లోడింగ్ చేయకపోవడంతో రైస్ మిల్లుల నుండి బియ్యం లోడ్ తో వస్తున్న లారీలు రోజుల తరబడి వేర్ హౌస్ ముందు ఉండిపోతున్నాయి. విను వెంటనే అన్లోడింగ్ కాకపోవడంతో రోజుకి 1ఒక వెయ్యి రూపాయలు చొప్పున ఒక్కో లారీకి మిల్లర్లు వెయిటింగ్ చార్జెస్ కింద చెల్లించి నష్టపోవాల్సి వస్తోంది. ఒక్క లారీ ఐదు రోజుల నుండి 25 రోజుల వరకు వెయిటింగ్ లో ఉండడం వల్ల లారీల అద్దెతో పాటు అదనంగా వేలకు వేల రూపాయలు చెల్లించి తాము తీవ్రంగా నష్టపోతున్నామని మిల్లర్లు వాపోతున్నారు.

బియ్యం లోడును వేర్ హౌస్ లో దింపడానికి మిల్లర్ల హమాలీలు దింపు కున్నప్పుడు గోదాం హమాలీ లకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి నప్పటికి ని వేర్ హౌస్ గోడౌన్లలో మిల్లర్ హమాలి రెండు రూపాయల తగ్గించి మిగతా డబ్బులు బలవంతంగా వసూళ్లకు పాల్పడుతున్నారు.

నిజామాబాద్ జిల్లాలో వేర్ హౌస్ గోడౌన్లలో ఒక్క ఏసీకే ఆరు రూపాయలు ప్రభుత్వం డబ్బులు తగ్గించగా మిగతా నాలుగు రూపాయలు చొప్పున ఒక్క ఏసీకేకు లాటింగ్ సాకుతో శుభోదయం వేర్ హౌస్ 2,320 రూపాయలు, ఉప్పల్వాయి వేర్ హౌస్ లో 4,060 రూపాయలు లోకేశ్వరంలో 3,360 రూపాయల చొప్పున బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని మిల్లర్లు గగ్గోలు పెడుతున్నారు. ఇక్కడే ఉంది కిట్టుకు అంతా కృత్రిమంగా హమాలీ హ్యాండిలింగ్ ట్రాన్స్పోర్ట్ కొరతను సృష్టించి రోజుల తరబడి బియ్యంలోడు లారీలను నిలిపివేస్తున్నారు.

అసలే సీజన్ సమయాల్లో రోజుల తరబడి బియ్యం లారీలు అన్లోడింగ్ కాక కిలోమీటర్ల కొద్ది వేర్ హౌస్ గోడౌన్ల వద్ద అన్లోడింగ్ కాకపోవడంతో  బియ్యం లోడుతో లారీలు నిలబడి ఉండడంతో మిల్లర్లకు అదనపు భారంతో పాటు వేర్ హౌస్ లకు బియ్యం చేరవేయడానికి లారీలు దొరకడం లేదు. కృత్రిమంగా హ్యాండ్లింగ్ ట్రాన్స్పోర్ట్ హమాలీ తోపాటు లారీలను వెయిటింగ్ లో పెట్టి మిల్లర్లలను ఇబ్బందుల గురిచేస్తూ కృత్రిమ కొరతను కలిగిస్తున్నారు. ఏ రోజుకు ఆరోజు హ్యాండ్లింగ్ ట్రాన్స్పోర్ట్ జరపకపోవడంతో మిల్లర్లకు తీవ్ర ఇబ్బందులు కలుగు తున్నాయి.

బియ్యం సకాలంలో గోడౌన్లకు బియ్యం చేరకపోవడం చేరకపోవడం వల్ల మూడు నాలుగు నెలల జాబ్యిం జరగడంతో డబ్బు కై రాష్ట్ర ప్రభుత్వంపై అధిక వడ్డీ భారం పడుతోంది. ఈ పరిస్థితి వేర్ హౌస్ గోడౌన్ లో నిర్వాహకుల అధికారుల కాసుల కక్కుర్తి ఇందుకు ప్రధాన కారణం, మితిమీరిన రాజకీయ జోక్యంతో రెచ్చిపోతున్న బడా వ్యాపారుల బినామీలు నిర్వాహకులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.

గత 20 సంవత్సరాలుగా తిష్ట వేసి గోడౌన్ అధికారులు బినామీలు వారికి సహకరిస్తున్న అధికారులు రెండు చేతుల అక్రమార్చనకు పాల్పడుతున్నరూ. ధాన్యం ఒక్క సీజన్ కు సుమారుగా 6లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ జరుగుతోంది. బియ్యం13,862 ఏసీకేలు 40, 19 980 క్వింటాళ్లు  కాగా ఒక్క జిల్లాలో ఒక్క సీజన్ కు సుమారుగా  అక్షరాల 2,33,15,884 రూపాయలు అదనంగా వసూళ్లకు పాల్పడుతున్నారు.

ఒక్క సీజన్ కు రూ: 2,33,15,884 వసూలు పాల్పడగా కరీఫ్, రబి సీజన్లకు కలి రూ:4,66,31,768 వసూల్ అవుతోండి. ఈ లెక్కన కేవలం ఒక్క నిజామాబాద్ జిల్లా పరిధిలో రూ: 4,66,31,768 వేర్ అస్ గోడౌన్లలో అక్రమార్కులు వసూలు చేస్తుండగా రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా ఏటా రెండు సీజన్లకు గాను ఒక 150 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర వేర్హౌస్ గోడౌన్లలో బినామీ హమాలీ కాంట్రాక్టర్ల పేరు చెప్పి మిల్లర్ల వద్ద నుండి బలవంతపు వసూళ్లతోదండుకుంటున్నారు. వసూళ్లలో ఎవరి వాటా ఎంత ఉంది అన్న విషయం అధికారులు దర్యాప్తు చేస్తే బయటపడుతుంది. 

ఈ విషయమై ఉన్నత అధికారులు దృష్టి సారించి సమగ్ర ధైర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఏళ్లకొద్దీ ఓకే స్థానంలో 20 సంవత్సరాలుగా తిష్ట వేసి ఉన్న అధికారులను తక్షణమే బదిలీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సంబంధించిన వేర్ హౌస్ గోదాంలలోనే 150 కోట్ల రూపాయల అదనపు వసూళ్లు జరిగితే  దోపిడీ ఏ మేరకు సాగుతోందో ఇట్టే అర్థమవుతుంది. ఈ అవినీతి బాగోతంపై అధికారులు సమగ్ర దర్యాప్తు చేయాల్సిఉంది.