calender_icon.png 19 October, 2025 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు 42% రిజర్వేషన్‌ కల్పించే వరకు పోరాటం

18-10-2025 08:25:48 PM

గండీడ్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం గండీడ్ మండల కేంద్రంలో బీ.సీ. జే.ఎ.సి, అఖిలపక్ష, బహుజన ప్రజాసంఘాల అధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ వాణిజ్య, వ్యాపార సంస్థలు, ప్రైవేట్ విద్యాలయాలు బంద్ చేయడం జరిగింది. అనంతరం వివిధ నాయకులు మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సాధించుకునేందుకు ఐక్యంగా ఉద్యమిద్దామని, బీసీల హక్కు 42 శాతం రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం తక్షణం అమలు చేయాలన్నారు.

బీసీలను నిర్లక్ష్యం చేయడం సమాజానికి అన్యాయం, రాజకీయ, విద్య, ఉపాధి రంగాల్లో బీ.సీ.లకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని,ఈ ఉద్యమం బీసీల న్యాయహక్కుల కోసం, ఏ పార్టీకి వ్యతిరేకం కాదని, అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని రాజకీయ శక్తులు కలసి బీ.సీ.ల సాధనలో భాగస్వాములై కలిసికట్టుగా బీ.సి.ల రిజర్వేషన్‌ సాధించే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో  అన్ని పార్టీల మండల అధ్యక్షులు మరియు వివిధ నాయకులు  పాల్గొన్నారు.