18-10-2025 08:25:41 PM
మాజీ జెడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి
హుజురాబాద్,(విజయక్రాంతి): మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రజల మనిషి ప్రజానాయకుడు అని శంకరపట్నం మాజీ జెడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై శనివారం మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ దిష్టిబొమ్మను బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... ప్రత్యేక రాష్ట్రానికి జరిగిన పోరాటంలో ముందుండి కాలుకు గజ్జగట్టి తెలంగాణ ధూంధాం ఏర్పాటు చేసి గుండెలు ఎదురు పెట్టి పోరాడిన ఘనత మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కి దక్కుతుందన్నారు.
కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే సత్యనారాయణ రసమయి బాలకిషన్ పై అర్ధ రహిత మాటలు, బుద్ధిహీనత మాటలు మనుకోవాలని హెచ్చరించారు. ఎమ్మెల్యే సత్యనారాయణ ప్రజలనుపక్కదారి పట్టిస్తున్నారని ప్రజా సమస్యల పోరాటం కోసం పోరాడుతున్న మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై నిందలు వేయడం సబబు కాదన్నారు. రెండు సంవత్సరాల నుండి ఎమ్మెల్యే డాక్టర్ కల్వంపల్లి సత్యనారాయణ చేసిన అభివృద్ధి ఏంటోనని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలతో పాటు నియోజకవర్గ ప్రజలు కూడా చూస్తున్నారన్నారు.
అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రజా సంక్షేమ పథకాలు పేదలకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడకుండా మాజీ ఎమ్మెల్యే పై ఆరోపణ చేయడం ఏంటిదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే సత్యనారాయణ రసమయి బాలకిషన్ కి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనియెడల తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ చౌడమల్ల వీరస్వామి, మలహళ్ రావు,గోపు విజయకుమార్ రెడ్డి, అనూష,శ్రీనివాస్, వెంకటరమణ రెడ్డి, రవి, పెద్ది శ్రీనివాస్ రెడ్డి, రామస్వామి తో పాటు తదితరులు పాల్గొన్నారు.