calender_icon.png 17 September, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ విమోచనోద్యమంలో యోధులు

17-09-2025 01:19:36 AM

  1. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన కొమరం భీం

పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర కీలకం

పోరాటయోధులకు స్ఫూర్తిగా స్మృతి చిహ్నాలు ఏర్పాటు 

ఆదిలాబాద్, సెప్టెంబర్ ౧6 (విజయక్రాం తి): భిన్న సంస్కృతుల సమ్మేళనంగా విలసిల్లుతున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రకృతి సోయగాలకే కాదు... పోరాటాల ఖిరాటాల సైతం పేరుపొందింది. ఆదిలాబాద్ జిల్లా పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది గిరిజన పోరాట వీరుడు కొమురం భీం పోరాట పటిమ, ఇంద్రవెల్లి అమరవీరుల రక్త తర్పణం. అయితే నాటి స్వాతంత్య్ర పోరాటం నుండి మొదలు కొని నిన్న మొన్న టి స్వరాష్ట్ర ఉద్యమం వరకు ఆదిలాబాద్ జిల్లా ఆయా పోరాటాల్లో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది.

అటు బ్రిటీష్ దాంస్య శృంఖలా లు, ఇటు నిజాం నిరంకుశత్వం నుండి విముక్తి కల్పించేందుకు సాగిన ఎన్నో పోరాటాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి ఎందరో మంది యోధులు పాలుపంచుకున్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా కొన సాగిన పోరాటమే జిల్లాలో స్వాతంత్య్ర ఉద్యమంగా పేరుపొందింది. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు నిరంకుశ నిజాంకు ఎదురొడ్డి పోరాటం చేశారు.

నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి అనేక మంది పాల్గొ న్నారు. నాడు ఉమ్మడి జిల్లాలోని  ఆదిలాబా ద్, నిర్మల్, భైంసా, సిర్పూర్ ప్రాంతాల్లో రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగాయి. సిర్పూర్, రాజూరా, కాగజ్ నగర్, చనాకా లలో ప్రత్యేక శిబిరాలు కూడా నిర్వహించారు. 

కొమురం భీం పోరాటం నేటికి ఆదర్శం

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గిరిజన వీరుడు కొమురం భీం పోరాటం సాగించారు. జల్... జంగిల్... జమీన్... నినాదంతో గిరిజనుల విముక్తి కోసం, స్వేచ్చా స్వాతంత్య్రాల కోసం పోరాటం సాగించి వీర  మరణం పొందారు. ఇదిలా ఉంటే హక్కుల కోసం పోరాడుతూనే నిజాంకు వ్యతిరేకంగా, స్వాతంత్ర భావనకు అనుకూలంగా ఈ ప్రాంత ప్రజలలో చైతన్యం తీసుకువచ్చేం దుకు ఇక్కడి సమరయోధులు కృషి చేశారు. ఆదిలాబాద్, మహారాష్ట్ర సరిహద్దులోని చన కా వద్ద శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని తమ పోరాటన్ని కొనసాగించారు. 

కమ్యూనిస్టు యోధుల పాత్ర కీలకం

నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరు  సమయంలో జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణం కూడా జరిగింది. రాంకిష న్ శాస్త్రీ, దాజీ శంకర్, కస్తాల రామకిష్టు, బాశెట్టి గంగారాం, డాక్టర్ బోలన్ వార్, పోతగంటి పోశెట్టి, రాజారెడ్డి, శివన్న,  తదితరులు జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమ వ్యాప్తికి విశేషంగా కృషి చేశారు. స్వాతంత్య్ర సమర యోధుడైన వన్నెల హన్మంతు స్పూర్తితో అతడి తనయుడు తాంసికి చెందిన వన్నెల ఎల్లన్న భార్య దేవుబాయితో కలిసి నిజాంకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారు. 

స్మృతిగా స్థూపాల నిర్మాణం..

ఆదిలాబాద్ ప్రాంతంలో నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న పోరాట యోధులు, స్వాతంత్య సమరయోధులు చిరస్మణీయులుగా నిలిచిపోయారు. వీరి పోరాటాలకు గుర్తుగా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిర్మించిన ప్రత్యేక స్థూపాలు, వారి పేరిట ఏర్పాటు కాలనీలు వారి త్యాగాలకు గుర్తుగా నిలుస్తున్నాయి. మరోవైపు నాటి యోధుల జ్ఞాపకార్ధం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఓ స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేసి, దానిపై వారి పేర్లు చెక్కించారు. నల్లటి గ్రానై ట్ రాయితో ఏర్పాటు చేసిన ఈ స్థూపం ఆనాటి పోరాటానికి నిలువెత్తు స్మృతి చిహ్నంగా నిలుస్తోంది. 

మత పోరాటం కాదు... స్వతంత్ర పోరాటం...

నిజాంకు వ్యతిరేకంగా సాగిన పోరాటం మత పోరాటం కాదు, స్వతంత్రం కోసం సాగిన పోరాటం. నిజాం పాలనలో సాగిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని బీజేపీ పార్టీ హిందూ ముస్లింలకు మధ్య జరిగిన మత పోరాటంగా వక్రీకరిస్తోంది. తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ పాత్ర ఏమాత్రం లేదు, ఆనాడు కేవలం సీపీఐ పార్టీ, కమ్యూనిస్టులు మాత్రమే పోరాడారు. కానీ ఈ పోరాటంపై బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజాం కు వ్యతిరేకంగా 1948 లో ఆదిలాబాద్ తొలి ఎమ్మెల్యే దాజి శంకర్ నేతృత్వంలో పోరాట యోధులు 16 దళాలు గా ఏర్పడి సాయుధ పోరాటం చేసారు.

 ఎస్. విలాస్  సీపీఐ నేత, తొలి ఎమ్మెల్యే దాజీ శంకర్ తనయుడు