17-09-2025 01:17:15 AM
ఎంపీ గోడం నగేష్
ఆదిలాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి) : జాతీయ భాష హిందీ దేశాన్ని ఏకతాటిపై తీసుకొచ్చి స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి జాతీయ సమైక్యతకు తోడ్పడిన భాష అని పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ అన్నారు. జిల్లాలో హిందీ పండితులు హిందీ సేవలో ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించ డం అభినందనీయమన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన హిందీ దినోత్సవ కార్యక్రమానికి ఎంపీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హిందీ భాష సేవా సమితి జిల్లా అధ్యక్షులు సుకుమార్ పెట్కూలే సద్గురు పులా జీ బాబా బోధనలపై రాసిన 108 దొహేల హిందీ, తెలుగు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి, జిల్లా, మండల స్థాయిలో అవార్డు అందుకున్న వారిని ఘనం గా సన్మానించారు. కార్యక్రమంలో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
వ్యాసరచన, ఉపన్యాస, చిత్రలేఖనము, పాటలు, నృత్య పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు అతిథులు చిట్యాల సుహాసిని రెడ్డి, హిందీ డైలీ పత్రిక సంపాదకులు సందేశ్, ప్రముఖ సాహితీవేత్త మధు బావలకర్‌లు బహుమతులను అందజేశా రు. హిందీ యొక్క గొప్పతనాన్ని గురించి వక్తలు వివరించారు. అనంతరం హిందీ భాషా సేవ సమితి నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు.
జిల్లా అధ్యక్షులుగా మూడోసారి సుకుమార్ పెట్కులే, ప్రధాన కార్యదర్శిగా దత్తాత్రేయ ద్రోణాలేలతో పాటు ఇరవై ఒక్క మంది కార్యవర్గాన్ని ఎన్నుకోబడ్డారు. కార్యక్రమంలో చివరిగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యుల ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో హిందీ ఉపా ధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ప్రముఖ సాహితీవేత్తలు హిందీ భాష ప్రేమికులు పాల్గొన్నారు.