18-08-2025 12:00:00 AM
జిన్నారం (గుమ్మడిదల), ఆగస్టు 17 : జిన్నారం మండలంలో 11 గ్రామాలకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు సహకారంతో ఐమాక్స్ లైట్లు పంపిణీ చేయగా మిగతా గ్రామాలకు రెండో విడతలో వస్తాయని బీజేపీ నాయకులు తెలిపారు. గత పది సంవత్సరాలు ఎంపీగా ఉన్న బిఆర్‌ఎస్ నాయకుడు ఒక్కనాడు కూడా జిన్నారం మండలం ప్రజలను పట్టించుకున్న పాపానపోలేదని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు వంగేటి ప్రతాపరెడ్డి, సీనియర్ నాయకులు కురుపల్లి నర్సింగరావు, జిన్నారం మండల అధ్యక్షులు కొత్త కాపు జగన్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబర్ పూడూరి సుధాకర్, నాయకులు నల్లగండ్ల అశోక్ కుమార్, కమ్మరి కృష్ణ, కొరివి దేవేందర్, ఆంజనేయులు, ఏర్పుల వీరేష్, గంగు లక్ష్మణ్, సీతా రాజు ,కుమ్మరి ప్రవీణ్, నవీన్ రాజు, సిహె ప్రవీణ్, కాషా ఆంజనేయులు, ఏర్పుల యాదగిరి పాల్గొన్నారు.