calender_icon.png 7 November, 2025 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డుపై గుంతలు పూడ్చివేత

07-11-2025 12:00:00 AM

యువతపై అభినందనల వెల్లువ..

మొయినాబాద్, నవంబర్ 6  (విజయక్రాంతి): ఇటీవల చేవెళ్ల నియోజకవర్గం లోని మిర్జాగూడ సమీపంలో రోడ్డుపై గుంతల కారణంగా   ఘోర ప్రమాదం జరిగి 19 మంది ప్రాణాలు విడిచారు. ఇలాంటి ఘటనలు  మన ప్రాంతంలో జరగోద్దనే ఉద్దేశంతో ఆ గ్రామ యువకులు నడుం బిగించారు. రోడ్డుపై ఏర్పడిన గుంతల తో రాకపోకలు సాగించే తమ గ్రామ ప్రజలు  నిత్యావస్థలు పడుతున్నారని... గుర్తించి  యువకులు  రోడ్డుపై ప్రమాదకరంగా ఉన్న గుంతలను పూడ్చివేశారు.

దీంతో యువకులు చేసిన పనిని పలువురు అభినందిస్తూ  వారి పైన ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్లితే  మొయినాబాద్ మున్సి పాలిటీ పరిధిలోని సురంగల్ గ్రామం నుంచి మండల పరిధిలోని శ్రీరాంనగర్ గ్రామం సరి హద్దు రోడ్డు అస్తవ్యస్తంగా మారింది. ప్రతినిత్యం ఈ రహదారి గుండా ప్రజలు రాకపోకలు సాగించాలంటేనే బెంబేలెత్తుతున్నారు.

రోడ్డు మరమత పనులు చేపట్టాలని అధికారులు ప్రజాప్రతినిధులకు చెప్పిన త్వరలో పట్టింపు లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గ్రామ యువకులే ముందుకు వచ్చి తమ సొంత నిధులతో పాటు ఆ రోడ్డు సమీపంలో ఉన్న ఫామ్స్ నిర్వాహకుల సహకారంతో నిధులు సేకరించి రోడ్డు పై ఏర్పడిన ఏర్పడినగుంతల్లో మొరం పోసి చదును చేశారు. దీంతో ఆ రోడ్డు మీద వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు, విద్యార్థుల తల్లిదండ్రులు వర్షం వ్యక్తం చేసి ఆ యువకులను అభినందించారు.