calender_icon.png 7 November, 2025 | 3:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటితో వందేమాతరానికి 150 ఏళ్లు

07-11-2025 12:00:00 AM

రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గీతాలాపన

హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి) : వందేమాతరం గీతాన్ని బంకిం చంద్ర చటర్జీ రచించి నేటికి 150 ఏళ్లు అయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గీతాలాపన చేయనున్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉదయం11 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గీతాలాపన చేపట్టాలని సూచించింది. ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్లు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో నిర్వహించాలని ఆదేశిం చింది.

వందేమాతరం గీతాన్ని 1875 నవంబర్ 7వ తేదీన రచించారు. అయితే ఆయన వందేమాతరం గీతాన్ని రచించి నేటికి సరిగ్గా 150 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వందేమాతరం సామూహిక కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.