23-12-2025 12:12:20 AM
సాధారణం కంటే తక్కువ నమోదు
హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): రాష్ట్రంలో రానున్న రెండు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. మంగళ, బుధవారాల్లో ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్‌తోపాటు కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ శీతల గాలులు వీస్తాయని తెలిపింది. సోమవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 7.0 డిగ్రీలు అత్యల్ప ఉష్ణోగ్రత నమోదుకాగా, సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 7.5 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా భీమ్‌పూర్‌లో 8.3 డిగ్రీలు నమోదైంది.