18-08-2025 12:40:53 AM
నల్లగొండ క్రైమ్, ఆగస్టు 17 : అనారోగ్యంతో మరణించిన పోలీస్ జాగిలానికి ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయం లో ఘనఃగా అతిమ వీడ్కోలు పలికి అధికారికంగా దహన సంస్కారాలు చేశారు -జిల్లా పోలీస్ శాఖకు జాగీలం (పింకీ ) అందించిన సేవలు ఎంతో గుర్తింపు తెచ్చాయి.
పింకీ విధినిర్వహణలో చేసిన సేవలు పోలీస్ శాఖకు మంచి గుర్తింపు తెచ్చింది. అడిషనల్ ఎస్పి రమేష్ పూలమాల వేసి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించి అధికార లాంఛనాల తో అంత్య క్రియలు నిర్వహించారు.