19-07-2025 11:19:52 PM
సిర్పూర్ యూ (విజయక్రాంతి): మండలంలోని పుల్లారా గ్రామపంచాయతీ తుమ్మగూడ గ్రామానికి నిరుపేద కుటుంబానికి చెందిన మర్సకొల కృష్ణ కర్ణాటకలోని రాయ్ చూర్ యూనివర్సిటీలో రెండవ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం ఆదివాసీ పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్(Adivasi Police Welfare Association) తరపున విద్యార్థికి రూ.22 వేలు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పోలీస్ అధికారులు, గోవింద్, వెంకట రమణ, బహదూర్ షా, గోవింద్, శంకర్, తిర్మల్ తదితరులు ఉన్నారు.