19-07-2025 11:22:44 PM
ఎంతో విలువైన ఆస్తులకు యజమానులను చేస్తున్నాం..
రూ.3.36 కోట్లు విలువైన వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ..
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి..
జడ్చర్ల: అంకితభావం పనిచేస్తూ ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని సంకల్పంతో అడుగులు వేస్తున్నామని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి(MLA Anirudh Reddy) అన్నారు. జడ్చర్లలో ఇందిరా మహిళా శక్తి విజయోత్సవం వేడుకల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులకు మహిళలను యజమానులను ప్రజాపాలన ప్రభుత్వం చేస్తుందన్నారు. మీ తమ్ముడిగా ఎల్లప్పుడూ అండగా ఉంటూ ప్రతి ఒక్కరి ఎదుగుదలకు తోడ్పాటు అందిస్తానన్నారు. మహిళా సంఘాలకు బస్సులను కూడా అందించడం ద్వారా ఆర్థికంగా మరింత బలోపేతం కావడం జరుగుతుందని స్పష్టం చేశారు.
మహిళా సంఘాలకు రూ.3.36 కోట్లు విలువైన వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని, బస్సుల అద్దె కోసం రూ.1.38 కోట్ల, లోస్ బీమా రూ.18.23 లక్షలు, ప్రమాద బీమా రూ.30 లక్షలు, బ్యాంకు లింకేజ్ రూ.16.50 కోట్లు విలువ గల చెక్కులను,మైనారిటీ మహిళల కోసం కుట్టు మిషన్లను అందజేశామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మహిళలకు ఆర్థికంగా స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి ఒక్కరు ప్రజాపాలన ప్రభుత్వంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని ఆశాభవం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కోత్వాల్, మున్సిపల్ చైర్ పర్సన్ కోనేటి పుష్పలత, ఏఎంసి చైర్ పర్సన్ తంగేళ్ల జ్యోతి అల్వాల్ రెడ్డి, కౌన్సిలర్లు, మార్కెట్ డైరెక్టర్‌లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.