calender_icon.png 21 July, 2025 | 6:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా పాలనలో రేషన్ కార్డుల పండగ

19-07-2025 11:17:20 PM

ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్..

పాపన్నపేట: పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నిరుపేదలకు రేషన్ కార్డులు ఇవ్వలేదని, కానీ ప్రజా పాలనలో ప్రజలు కొత్త రేషన్ కార్డుల పండుగ జరుపుకుంటున్నారని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు(MLA Mynampally Rohith Rao) అన్నారు. శనివారం పాపన్నపేట మండల పరిధిలోని అరికెలలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నిరుపేదలను పట్టించుకున్న పాపాన పోలేదని, కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోవింద్ నాయక్, సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి,  నాయకులు శ్రీకాంతప్ప, నరేందర్ గౌడ్, జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.