calender_icon.png 22 December, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సాయం

22-12-2025 12:40:07 AM

మర్రిగూడ, డిసెంబర్ 21(విజయక్రాంతి): మండలంలోని అజిలాపురం గ్రామానికి చెందిన మాధగోని వెంకటేష్ నవంబర్ 8న రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామంలో తాను నూతనంగా నిర్మిస్తున్న ఇంటివద్ద ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తో మృతి చెందాడు. మృతునికి భార్య ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, వెంకటేష్ తో పాటు  యరగండ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2001_ 22 విద్యా సంవత్సరంలో పదోతరగతిని అభ్యసించిన విద్యార్థులు అందరూ కలిసి రూ. 74 వేల ఆర్థిక సహాయాన్ని ఆదివారం ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా వెంకటేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెంకటేష్ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పునూతల కృష్ణయ్య, రొక్కం మసూదన్ రెడ్డి, వెంకట్ బాబు, సిద్ధపురం జంగయ్య, వల్లముల శ్రీను, నారోజు రామాచారి, రమేష్, శ్రీను,కొండల్, రజాక్ తదితరులు పాల్గొన్నారు.