22-12-2025 12:43:55 AM
మఠంపల్లి, డిసెంబర్ 21(విజయక్రాంతి): మండలంలోని మట్టపల్లి గ్రామంలో ఉన్న సుప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహ పుణ్య క్షేత్రంలో గల శ్రీ భక్త మార్కండేశ్వర అఖిల భారత పద్మశాలి నిత్యాన్నసత్రంలో సత్రం అధ్యక్షులు చిన్నం వీర మల్లు అధ్యక్షతన ఆదివారం సన్నాహక సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకాదశి పర్వదినం నాడు పుణ్య క్షేత్రానికి దర్శించే పద్మశాలి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డిసెంబర్ 29వ తేదీన సాయంత్రం,30వ తేదీన ఉదయం అన్న వితరణ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో సత్రం గౌరవ సలహాదారు రుద్ర కృష్ణ రావు, ప్రధాన కార్యదర్శి కొంగర నరసింహ రావు, కోశాధికారి దోనే చిన అంకయ్య,కార్య నిర్వాహక అధ్యక్షుడు పి.రామచంద్రయ్య, ఉపా ధ్యక్షులు ఎ.రామ రావు, ఎ.వేణు, సహాయ కార్యదర్శి జి.రాజేష్ పాల్గొన్నారు.