calender_icon.png 22 January, 2026 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌ఆర్‌ఆర్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం

22-01-2026 01:47:15 AM

హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి): వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇటీవల మాజీ వార్డ్ నెంబర్ ఎండీ జహంగీర్ మృతి చెందగా, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. అనంతరం రాయపర్తి మండలం మొరిపిరాల గ్రామంలో వార్డ్ మెంబర్‌గా పెందోటా శ్రావణి శివ గెలుపొందిన సందర్భంగా ఆమెను శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లేతకుల రంగారెడ్డి, తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, గజవెల్లి ప్రసాద్, చందు రాము, సంకినేని ఎల్లస్వామి తదితరులు పాల్గొన్నారు.