22-01-2026 01:48:13 AM
జవహర్‌నగర్ ఎస్‌హెచ్‌వో సైదయ్య
జవహర్ నగర్, జనవరి 21(విజయక్రాంతి): అప్రమత్తతతో ప్రయాణించి ప్రమా దాలను అరికడదామని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించాలని జవహర్ నగర్ ఎస్‌హెచ్‌వో సైదయ్య పిలుపు నిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధి జవహర్ నగర్ ప్రధాన చౌరస్తాలో రోడ్డు భద్ర తా వారోత్సవాల్లో భాగంగా జవహర్ నగర్ ఎస్ హెచ్ వో సైదయ్య ఆధ్వర్యంలో బుధవారం వాహనాదారులు, విద్యార్థులతో కలిసి అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా సైదయ్య మాట్లాడుతూ సెల్ ఫోన్ చూస్తూ డ్రైవింగ్ అతిప్రమాదమని, మద్యం మత్తులో యువత ప్రాణాలు కోల్పోయి కుటుంబానికి తీరని శోకం మిగిల్చుతున్నారన్నారు. రోడ్డు ప్రమాదాల ను నివారించి సురక్షిత ప్రయాణం సాగించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. అనంత రం విద్యార్ధులు, వాహనదారులతో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఎస్త్స్ర రాము, ఎస్త్స్రలు లక్ష్మయ్య, వేణుమాధవ్, మమత, ట్రాఫిక్ పోలీసులు, పాఠశాల విద్యార్థులు, వాహనదారులు పాల్గొన్నారు.