28-12-2024 12:00:00 AM
దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మొదట ఆర్థికవేత్తగా, ఆ తర్వాతనే రాజకీయ వేత్తగా చరిత్రలో గుర్తుండిపోతారు. 30 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలు ఆ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే కాదు, ప్రస్తుతం అధిక వృద్ధిరేటు దిశగా సాగేందుకు ఉపకరించాయంటే ఆయన ముందుచూపు అర్థమవుతుంది.
1991లో పీవీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టేనాటికి దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ద్రవ్య లోటు జీడీపీలో 8.5 శాతానికి , కరెంటు ఖాతా లోటు 3.5 శాతానికి చేరుకుంది. ద్ర వ్యోల్బణం రెండంకెల స్థాయికి చేరి సామాన్యులకు భారంగా మారింది. విదేశీ మారకనిల్వలు కేవలం రెండు వారాల చెల్లింపులు చేసేంత స్థాయిలోనే ఉన్నాయి.
దీంతో కొత్తగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు రాజకీయాలతో సంబంధం లేని ఆర్థికవేత్తకు ఆర్థికమంత్రి బాధ్యతలు అప్పగించారు. ఆయనే మన్మోహన్ సింగ్. అ ప్పడు ఆయన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్‌గా ఉ న్నారు. ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే మన్మోహన్ సావరిన్
డిఫాల్ట్ ముప్పునుంచి దేశాన్ని గట్టెక్కించడానికి రెండు దఫాలుగా ప్రధాన కరెన్సీలతో రూపాయిమారకం విలువను 20 శాతం మేర తగ్గించారు. దీం తో ఎన్నారైలు వెనక్కి తీసుకున్న డాలర్లను తిరిగి మన దేశంలోకి పంప్ చే శారు. అలాగే భారత్ వద్ద ఉన్న పసిడి నిల్వలను విదేశీ బ్యాంకుల్లో తనఖా పెట్టి 400 మిలియన్ డాలర్లు సేకరించారు. ఫలితంగా చెల్లింపుల సమస్య తొలగిపోయింది.
మరోవైపు దేశంలో పారిశ్రామికాభివృద్ధి, విదేశీ పెట్టబడులు పెరగడం కోసం అప్పటివరకు ఉన్న లైసెన్స్‌రాజ్‌కు స్వస్తి చెప్పాల్సిన అవసరాన్ని ప్రధానికి స్పష్టంగా తెలియజేసి ఒప్పించారు. 1991జులై 24న ఆర్థిక మంత్రిగా తన తొలి బడ్జెట్‌ను సమర్పించిన మన్మోహన్ పరిశ్రమరంగ అభివృద్ధికి ఎదురవుతున్న పలు అవరోధాలను తొలగిస్తూ కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టారు.
ఆటోమేటిక్ పద్ధతిలో 51 శాతం దాకా విదేశీ ప్రత్యక్షపెట్టుబడులకు అనుమతిచ్చారు. ఇవే కాకుండా ఎగుమతులకు ఊతమిచ్చేందుకు సులభతర వాణిజ్య విధానానికీ చర్యలు తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా ప్రైవేటు రంగం ఊపందుకుంది. వంద రోజుల్లోనే స్పష్టమైన మార్పు కనిపించింది. మన్మోహన్ తీసుకున్న సాహసోపేత చర్యలతో ఆ బడ్జెట్ ‘గేమ్ చేంజర్ బడ్జెట్’ గా నిలిచింది.
2004నుంచి పదేళ్ల పాటు రెండుసార్లు ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ మొదటి పర్యాయంలో దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు. పైకి మృదు స్వభావిగా కనిపించినా దేశం కోసం తీసుకునే నిర్ణయాల్లో అత్యంత కఠినంగా వ్యవహరించారు. 2008లో అమెరికాతో కుదుర్చుకున్న పౌర అణుఒప్పందమే దీనికి నిదర్శనం.
భారత్ ప్రపంచ అణుమార్కెట్లోకి ప్రవేశించడానికి, ఇంధన సంక్షోభాన్ని అధిగమించడానికి ఇది దోహదపడింది. యూపీఏ ప్రభుత్వానికి బైటినుంచి మద్దతిస్తున్నలెఫ్ట్ పార్టీలు దీన్ని వ్యతిరేకించి మద్దతు ఉపసంహరించుకున్నా ఆయన వెనక్కి తగ్గలేదు. అవసరమైతే ప్రధాని పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధమయ్యారు. మన్మోహన్ హయాంలో దేశ జీడీపీ సగటున 89 వృద్ధి రేటును సాధించింది.
2007లో అత్యధికంగా 9 శాతం వృద్ధిరేటును నమోదు చేయడమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండో ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. ఇప్పుడున్న ఆధార్, జీఎస్‌టీ వ్యవస్థలు మన్మోహన్ హయాంలో తీసుకు వచ్చిన సంస్కరణలే. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు ఆయన తన మౌనంతోనే సమాధానం చెప్పారు. 30 ఏళ్ల క్రితం మన్మోహన్ తీసుకున్న సాహసోపేత నిర్ణయాల ఫలాలను దేశం ఇప్పుడు అనుభవిస్తోంది.