calender_icon.png 24 November, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ పోరాటంతోనే వేలిముద్రల నిబంధన తొలగింపు

24-11-2025 01:35:15 AM

  1. మాజీ మంత్రి జోగు రామన్న

బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో సంబురాలు

ఆదిలాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ పార్టీ రైతుల పక్షాన చేసిన పోరాట ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి కొనుగోళ్లలో వేలిముద్ర నిబంధనను తొలగించడం జరిగిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అద్యక్షుడు జోగు రామన్న అన్నారు. ఇది ముమ్మాటికి రైతుల విజయమని పేర్కొన్నారు. ఇటీవల జిల్లాలో పర్యటించిన పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోరాటం వల్లే ప్రభుత్వాలు దిగువచ్చాయన్నారు.

వేలిముద్ర తొలగింపు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం పార్టీ కార్యాలయంలో మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చిత్రపటాలకు  పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం టపాసులు పేల్చి సంబురాలు జరుపుకున్నారు. రైతుల పక్షాన బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వ ర్యంలో నిరంతరం నిరసన, ధర్నా కార్యక్రమాలను చేపట్టి  జాతీయ రహదారి దిగ్బం ధంతో పాటు, కేటీఆర్ జిల్లా పర్యటనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కదిలించిం దాని జోగు రామన్న పేర్కొన్నారు.

రైతుల సెగను కేంద్ర రాష్ట్రాలకు వినిపించి ఏడు క్వింటాల కొనుగోలను, 12 క్వింటల్ లకు పెంచేలా చేయడమే కాకుండా, రైతు కుటుంబాలు  ఎంతగానో ఎదురుకుంటున్న వేలి ముద్ర నిబంధనను తొలగించడం జరిగిందన్నారు. కిసాన్ కపాస్ యాప్ ను సైతం తొలగించే దిశగా రైతుల పక్షాన మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని జోగు రామన్న అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఏ మొఖం పెట్టుకొని గ్రామాలలో రైతు కుటుంబాలను కలుస్తూ ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అజయ్, గండ్రత్ రమేష్, యూనిస్ అక్బాని, దాసరి రమేష్, కొండగణేష్, సాజిదోద్దీన్, కానక రమణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.