calender_icon.png 24 November, 2025 | 2:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలి

24-11-2025 01:33:42 AM

బీసీ జేఏసీ చైర్మన్ రూపునర్ రమేష్

కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి):బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని బిసి జేఏసీ జిల్లా చైర్మన్ రూపునర్ రమేష్ అన్నారు .జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జీవో నెంబర్ 46 ప్రతులను కాల్చివేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 42%శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తానని బీసీలను నమ్మించి మోసం చేసిందని మండిపడ్డారు.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను ఓట్లు వేసే మిషన్ లాగానే చూస్తున్నాయని బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా న్యాయం జరగడం లేదన్నారు . స్థానిక ఎన్నికల్లో స్వతంత్రంగా బీసీలము పోటీ చేసి గెలుస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ డిసిసి నియమాకులలో సైతం బీసీలకు మొండి చేయి చూపించిందని ఆరోపించారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క బీసీని కూడా డిసిసిగా నియమించకపోవడంతో బీసీలపై కాం గ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి కనపడుతుందన్నారు.

ఇప్పటికైనా బిజెపి, కాంగ్రెస్, బిఆర్ ఎస్ పార్టీలు బీసీలపై ప్రేమ ఉంటే బిసి 42% రిజర్వేషన్ తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ ఆవిడపు ప్రణయ్ కుమా ర్, బీసీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వైరగడ మారుతి పటేల్, బీసీ సంక్షేమ సంఘం ఆసిఫాబాద్ మండల అధ్యక్షుడు సిరికొండ సాయికృష్ణ బీసీ నాయకులు జూలూరి విలాస్, చాపిడి సురేష్ తదితరులున్నారు.