calender_icon.png 14 May, 2025 | 7:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముల్కనూర్ స్వకృషి పాల డెయిరీ నాణ్యత ప్రమాణాలలో మేటి

14-05-2025 12:00:00 AM

భీమదేవరపల్లి మే 13 (విజయ క్రాంతి) జాతీయస్థాయి నాణ్యత ప్రమాణాలు పాటించడంలో ముల్కనూర్ స్వకృషి మహిళా పాల డైరీ ఆదర్శంగా నిలుస్తుందని హనుమకొండ,వరంగల్ జిల్లా కలెక్టర్లు ప్రావిణ్య,సత్య శారద లు అన్నారు. ముల్కనూర్‌లోని స్వకృషి పాల డైరీ ని మంగళవారం పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తో కలిసి వారు సందర్శించడం జరిగింది.

ఈ సందర్భంగా డైరీ జనరల్ మేనేజర్ మార్పాటి భాస్కర్ రెడ్డి వారికి డైరీ ప్రారంభం నుంచి నేటి వరకు జరుగుతున్న కార్యక్రమాల పట్ల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించడం జరిగింది. అనంతరం పరకాల నియోజవర్గంలోని డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులు డైరీ నిర్వహణను అధ్యయనం చేసేందుకు గత రెండు నెలలుగా శిక్షణ పొందుతున్న వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకోవడం జరిగింది.

దేశంలోనే మహిళల చే నిర్వహించబడుతున్న మొట్టమొదటి మహిళా సహకార పాల డైరీ ఉత్పత్తులను వారు పరిశీలించారు. ఇప్పుడిప్పుడే ఏర్పడుతున్న సహకార సంఘాలకు ఆదర్శంగా నిలుస్తూ కొత్తగా ఏర్పాటు చేసుకునే వారికి అధ్యాయాన కేంద్రంగా ముల్కనూర్ మహిళా డైరీ నిలిచిపోతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ,వరంగల్ జిల్లాల డి ఆర్ ఓ లు శ్రీనివాస్, కౌసల్యా దేవి, డైరీ అధ్యక్షురాలు ధనశ్రీ, తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో వీరేశం, ఐకెపి ఎపిఎం దేవానంద్ తదితరులు పాల్గొన్నారు.