calender_icon.png 24 May, 2025 | 7:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరం

07-05-2025 01:15:38 AM

- అగ్ని ప్రమాదాల నివారణ దిశగా అవగాహన కార్యక్రమాలు

ఎండాకాలంలో చాలా వరకు అజ్ఞ ప్ర మాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా చూసుకున్నట్లతే సమాధానం రక్షించుకోవచ్చని అగ్నిమాపక శాఖ అధికారులు సూచించారు. 

వనపర్తి, మే 06 ( విజయక్రాంతి ) :  ఎం డాకాలంలో రైతులు ప్రజలు అగ్ని ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసు కోవాలని అగ్ని మాపక శాఖ అధికారులు సూచిస్తున్నారు. సాధారణంగా ఎండాకాలంలో ప్రమాదాలు జరిగిన సంఘటనలు చాలానే కనిపిస్తుంటాయి. చిన్నచిన్న నిర్లక్ష్యం వల్ల అగ్ని ప్రమాదాలకు దారి తీస్తాయి  వాటిని అరికట్టడంలో అగ్ని మాపక శాఖ సకాలంలో స్పందించడమే కాకుండా సాహసోపేతం చేయాల్సి ఉంటుంది 

 అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ప్రధానంగా గ్రామాల్లో గడ్డివాములు చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి. అలా కా కుండా గడ్డివాముకు గడ్డివాము కు చాలా దూరంగా,  విద్యుత్ వైర్ల కింద,  ట్రాన్స్ఫర్లకు దూరంగా పెట్టుకోవాలి లేకుంటే తీగలు కలిసినప్పుడు లేదా ట్రాన్స్ఫార్మర్ లో  చిన్న లో పాలు ఏర్పడి ఆ సమయంలో మంటలు చెలరేగే అవకాశాలు ఉన్నందున అప్పుడు ఆ మంటలు గడ్డివాములకు తగిలి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీ టన్నిటికీ దూరంగా పెట్టుకున్నట్లయితే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చు.

పంట పొలాల్లో పంటలు మొత్తం చేతికి వచ్చిన తర్వాత భూమిలో మిగిలిన చెత్తకు రైతులు మంటలు పెట్టడం సర్వసాధారణం. కానీ మంటలు పూర్తయ్యే వరకు రైతులు అక్కడే ఉండడం వల్ల ఇతర అగ్ని ప్రమాదా లు జరగకుండా నివారించవచ్చు

 ఎండాకాలంలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో అగ్ని ప్రమాదాలకు కూడా జరగవచ్చు ఇలాంటి జరగకుండా ముందుగా విద్యుత్ పైపులు,  కరెంటు వైర్లు స్విచ్ బోర్డు కరెక్ట్ గా ఉన్నా యా లేదా చెక్ చేసుకుని ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే విద్యుత్ రిపేర్లు చేయిం చుకోవాలి 

చార్జింగ్ బ్యాటరీ వాహనాల పట్ల జాగ్రత్తలు  తీసుకోవాలి. వాహనాలు నడిపి ఇం టికి వచ్చిన వెంటనే చాటింగ్ పెట్టవద్దని కొంత సమయం తీసుకుని పెట్టడంతో పా టు ఎంతో సమయం పెడితే చార్జింగ్ అవుతుందో చూసుకుని ఆ సమయాన్ని విధిగా పాటించాలి.

 పలు అవగాహన కార్యక్రమాలు

 ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అగ్నిమాపక వారోత్సవాల కార్యక్రమం లో భాగంగా జిల్లా కేంద్రంలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో పలు కళాశాలలో,  ఆసుపత్రులు బస్టాండ్, పలు ప్రధాన చౌరస్తాల వద్ద అగ్ని ప్రమాదాలను నివారించడానికి గల సలహాలను సూచనలు ఇస్తూ అగ్ని ప్రమాదాల నుండి ఎలా బయటపడాలో ప్రజలకు అవగాహనను కల్పించారు

 జిల్లాలో అగ్నిమాపక కేంద్రాల వివరాలు ఇలా ..

 వనపర్తి జిల్లాలో మూడు అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. వనపర్తి పరిధిలో ( వనపర్తి గోపాల్పేట, పానగల్, రేవల్లి, ఖివల్లి ఘనపురం,  శ్రీరంగాపురం చిన్నంబావి ),,  కొత్తకోట పరిధిలో ( కొత్తకోట,  పెబ్బేరు, పెద్దమందడి మదనాపురం ), ఆత్మకూర్ పరిధిలో ( ఆత్మకూర్, అమరచింత ) మండలా లు ఉన్నాయి. మూడు అగ్గిమాపక కేంద్రాలు మూడు అగ్నిమాపక వాహనంతో పాటు వనపర్తి ఆత్మకూరు పరిధిలో ఒక బుల్లెట్టు వాహనంతో కూడిన చిన్నపాటి అగ్నిమాపక వాహనం అందుబాటులో ఉన్నాయి. 

ముందస్తు చర్యలు తీసుకున్నట్లయితే అగ్నిప్రమాదాలను నివారించవచ్చు...

 అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నట్లయితే అగ్ని ప్రమాదాల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి.  అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు భాగంగా ప్రజలకు ప్రజలకు పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. 

 నరసింహారెడ్డి అగ్నిమాపక శాఖ అధికారి వనపర్తి