calender_icon.png 13 December, 2025 | 8:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా మొదటి దశ పోలింగ్

12-12-2025 01:14:28 AM

నిర్మల్, ఖానాపూర్, డిసెంబర్ 1౧ (విజ యక్రాంతి): నిర్మల్ జిల్లాలో గురువారం జరిగిన మొదటి దశ గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించారు. మొదటి విడత కింద 136 గ్రామ పంచాయతీలకు గాను 16 ఏకగ్రీవం కాగా 120 గ్రామపంచాయతీలో గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికల పోలింగ్ నిర్వహించారు.

జిల్లాలోని పెంబి దస్తురాబాద్ కడెం ఖానాపూర్ లక్ష్మణ చందా మాముడా మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో ఉదయం నుంచే ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఉద యం మందకోడిగా ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ 10 తర్వాత ఊపందుకోవడంతో జిల్లాలో 70% పైగా ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు.

మారుమూల గ్రామాల్లో సైతం ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పా టు చేశారు. చివరి రోజు కూడా ఎన్నికల పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు తమధరక్షరిలో విశ్వ ప్రయత్నాలు చేస్తూ గెలుపు కోసం కష్టపడ్డారు

అందరు సహకారంతోనే ఎన్నికలు ప్రశాంతం

నిర్మల్ జిల్లాలో మొదటి దశ ఎన్నికల ప్రక్రియ అందరు సహకారంతో విజయవంతమైందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రత్యేక పరిశీలకురాలు ఆయేషా ముషరఫ్ కాణం తెలిపారు ఎన్నికల పోలీసు సందర్భంగా లక్ష్మణ్ చందా మామడ ఖానాపూర్ దస్తురాబాద్ తదితర మండలాల్లో పర్యటించి ఎన్నికల నిర్వహణపై ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు చేశారు ఆయా పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎన్నికల నియమాలను పాటిస్తూ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసినట్టు తెలిపారు.

గెలుపొందిన అభ్యర్థులకు ధృవపత్రాలు జారీ

నిర్మల్ జిల్లాలోని మొదటి విడతగా జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు పోలింగ్ ఆఫీసర్లు దృపత్రాలను జారీ చేశారు. అంతకుముందు రెండు గంటల నుంచి ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించారు గెలుపొందిన అభ్యర్థులకు ఎన్నికల పిఓలు గెలిచినట్టు దృక్పత్రాలను జారీ చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో సమస్యత్మక గ్రామాల్లో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు రాజకీయ పార్టీల నాయకులు తమ తమ మద్దతుదారులు గెలుపు ఓటములపై ఎప్పటికప్పుడు వివరాలు రాసుకుంటూ పార్టీ అధిష్టానానికి నివేదిక ఇచ్చారు.