calender_icon.png 9 November, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీహార్‌లో 160 స్థానాల్లో గెలుస్తాం

09-11-2025 01:26:25 AM

  1. అక్రమ వలసదారులను బహిష్కరిస్తాం
  2. లాలూలా ఎవరూ కుంభకోణాలు చేయలేరు
  3. కేంద్ర మంత్రి అమిత్‌షా

పాట్నా, నవంబర్ 8: బీహార్‌లో 160 స్థానాలు గెలిసి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని కేంద్ర మంత్రి అమిత్‌షా అన్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి నాయకులు సీమాంచల్‌ను అక్రమ వలసదారుల అడ్డాగా మార్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారని ఆరోపించారు. మేమొస్తే అక్రమ వలస దారులను దేశం నుంచి బహిష్కరిస్తామని, వారిని తరిమికొడతామని పేర్కొనారు. బీహా ర్ రాష్ట్రంలోని పూర్ణియాలో ఎన్నికల ప్రచార సభను శనివారం నిర్వహించారు.

ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ.. ప్రతి అక్ర మ వలసదారుడిని దేశం నుంచి తరిమికొడతామన్నారు. ఇటీవల తేజస్వీ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు బదులిస్తూ ఏడు జన్మలెత్తినా లాలూ మాదిరిగా మోదీ కుంభకోణాలు చేయలేరని పేర్కొన్నారు. బీహార్‌లో 160 స్థానాలు విజయం సాధించి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పా రు. కాంగ్రెస్ కూటమికి ఇప్పటికే  సగం రాష్త్రం తలుపులు మూసేందని,  రైల్వే లో లాలూ తీసుకొచ్చిన లాభాలను మోదీ ఎప్పటికీ తీసుకురాలేరని స్పష్టం చేశారు. 

ఆధారం లేని ‘ఓట్ల చోరీ’ ఆరోపణలు

రాష్ట్రంలో ఓట్ల చోరీ జరిగిందన్న రాహుల్ గాంధీ ఆరోపణలు నిరాధారమైనవని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. వాటికి సంబంధించిన ఏమైనా ఆధారాలుంటే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని సూచించారు. రోహ్‌తాస్‌లో శని వారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. అందుకే ఆ పార్టీ నేత ఓట్ల చోరీ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.