calender_icon.png 10 November, 2025 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐదుగురు సభ్యుల దొంగల ముఠా అరెస్ట్

10-11-2025 12:40:44 AM

అరెస్టు చేసిన నిందితుల నుంచి 3 లక్షల 48 వేల నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం

కేసు వివరాలు వెల్లడించిన కాటారం డీఎస్పీ ఏ. సూర్యనారాయణ

కాటారం, నవంబర్ 9 (విజయక్రాంతి) : జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్న ఐదుగురు సభ్యులు గల దొంగలను పట్టుకున్నట్లు డిఎస్పి ఏ సూర్యనారాయణ తెలిపారు. శనివారం రాత్రి కాటారం డిఎస్పీ కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు. తక్కువ ధరకు బంగారం ఇస్తానని నమ్మబలుకుతూ కాటారంలో ఓ సూపర్ మార్కెట్ యజమానినీ ఆర్థికంగా మోసం చేసి, మరియు కాటారం మండలంలో పరిధిలోని నస్తురుపల్లి వద్ద ఓ వ్యక్తిపై భౌతిక దాడి చేసి, దారి దోపిడికి పాల్పడ్డ వారిని పట్టుకు నేందుకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖేరే  ఆదేశాలతో ప్రత్యేక బృందాలుగా గాలింపు చర్యలు చేపడుతుండగా శనివారం రాత్రి కాటారo మండల పరిధిలోని చింతకాని గ్రామ శివారులో ఐదుగురు వ్యక్తులు, ఇద్దరు మగ, ముగ్గురు మహిళలు, కాటారం నుండి మేడారం వైపు వెళ్తు అనుమానస్పదంగా కనిపించడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా, సూపర్ మార్కెట్ యాజమానీతో పాటు, ఓ వ్యక్తి పై భౌతిక దాడి చేసి దారి దోపిడి చేసింది తామేనని నిందితులు ఒప్పుకున్నారు.

ఈ నేరాలు  చేసిన వారిలో ప్రకాశం జిల్లాకు  చెందిన రాజు సోలంకి , నాగపూర్ కు చెందిన పుణ్య బాల బాలచంద్ రాథోడ్, మీనా పుణ్య రాథోడ్, మహారాష్ట్ర కారేగావ్ కు చెందిన శాంతి విజయ సోలంకి, స్వప్న ఈశ్వర్ సోలంకి ఉన్నట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించి, అరెస్టు చేసి, నిందితుల నుంచి రూ.3 లక్షల 48 వేల నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన కాటారం సిఐ ఈవూరీ నాగార్జున రావు, ఎస్త్స్ర ఆకుల శ్రీనివాస్, ఎస్త్స్ర జక్కుల మహేష్, హెడ్ కానిస్టేబుల్ ప్రవీణ్, కానిస్టేబుల్ లు రాజు, నాగరాజు, రామారావు జంపన్న, ఐటీ కోర్ వేణులను జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ అభినందించారనీ, డిఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ కాటారం సబ్ డివిజన్ ప్రజలు ఎవరూ దొంగల, మోసగాళ్ల బారిన పడవద్దని, ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. అలాగే ఎలాంటి సమస్యలు ఉన్న పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ తిరుపతి, కానిస్టేబుల్లు హరీ కుమార్ , గణేష్, లక్ష్మీ రాజ్, హరీష్, జగన్, శిరీష, జ్యోతి, స్వాతి హోం గార్డు తిరుపతిపాల్గొన్నారు.