calender_icon.png 10 November, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్‌హెచ్‌ఆర్‌సీ ములుగు జిల్లా ముఖ్యనాయకుల సమావేశం విజయవంతం

10-11-2025 12:44:20 AM

--పెద్ద ఎత్తున హాజరైన 10మండలాల నాయకుడు 

--శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

ములుగు,నవంబరు9(విజయక్రాంతి): ప్రతి పౌరుడు తమ హక్కులతోపాటు బాధ్యతలను తెలుసుకోవాలని, వ్యక్తులు శక్తులుగా తయారైనప్పుడే ఒక గొప్ప సమాజం నిర్మా ణం అవుతుందని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య అన్నారు. ము లుగు జిల్లా కేంద్రంలోని సన్రైజర్స్ హై స్కూ ల్ ప్రాంగణంలో జిల్లా అధ్యక్షులు పెట్టెం రా జు అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ అవినీతి అక్రమాలకు తావులేని సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన విద్యావంతులకు, మేధావులకు పిలుపునిచ్చారు. పేద ప్రజలకు అండగా, అణగారిన వర్గాలకు తోడుగా ములుగు జిల్లాలో ఎన్ హెచ్ ఆర్ సి బలమై న శక్తిగా ఆవిర్భవించిందని ఆయన తెలిపారు. జిల్లాలో మండల కమిటీలతో పాటు గ్రామ కమిటీలను కూడా ఏర్పాటు చేయడం శుభ సూచకమని ఆయన ములుగు జిల్లా క మిటీని, మండల కమిటీల బాధ్యులను అభినందించారు. జిల్లా సమగ్రాభివృద్ధికి మన సంస్థ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు అధికారులకు విజ్ఞప్తులు అందిస్తున్నామని, అధికార యంత్రాంగం కూడా స్పందించి తగు చర్య లు తీసుకుంటున్నదని ఆయన అన్నారు.

జి ల్లా అధ్యక్షులు పెట్టేం రాజు మాట్లాడుతూ ములుగు జిల్లాలో పురుడు పోసుకున్న జాతీ య మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) నేడు 13 రాష్ట్రాలతో పాటు తెలంగాణలో ని అన్ని జిల్లా కమిటీలను ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయమని ఆయన అన్నారు. పెన్ను పేపర్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. ఆశించడానికి కాకుండా శాసించడం అనేది గొప్ప వ్యక్తులకుండే గుణమని ఆ యన తెలిపారు.

ఆ ప్రయత్నంలో ప్రతి సభ్యున్ని శక్తిగా తయారు చేయడం కేవలం ఎన్ హెచ్ ఆర్ సి కే సాధ్యమవుతుందని ఆ యన స్పష్టం చేశారు. రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ పోరిక రవీందర్, గోగులమూడి హరికృష్ణ, సంజీవలు మాట్లాడుతూ భారత రా జ్యాంగ చట్టాలను అనుసరించి లీగల్ ప్రొసీజర్ తో ప్రోటోకాల్ సిస్టంతో ప్రజలకు ప్రభు త్వానికి వారధిగా ఉంటూ సమస్యల పరిష్కా రం కోసం కృషి చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. 

మృతి చెందిన ఎన్ హెచ్ ఆర్ సి. సభ్యులకు నివాళులు 

ఇటీవల కాలంలో మృతి చెందిన ఎన్ హెచ్ ఆర్ సి. ములుగు జిల్లాకు చెందిన స భ్యులు సంగ శివన్న, వెలిసోజు ప్రేమ్ సాగర్ లకు సమావేశం రెండు నిమిషాలు మౌనం పాటించి ఘన నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది.

పలువురికి నియామక పత్రాలు అందజేత

ఎన్ హెచ్ ఆర్ సి. ములుగు జిల్లా ఉపాధ్యక్షులుగా మల్యాల మనోహర్, మడికం మ లికంటి శంకర్, జాయింట్ సెక్రటరిగా జం పాల సత్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా లార్డ్ రాజులను నియమిస్తూ నియామ క పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా ములుగు జిల్లా ఇన్చార్జి కో డిపాక రవి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ డాక్టర్ ఓంకారం సుధాకర్, ములుగు పట్టణ అధ్యక్షురాలు ఉప్పుల కోమల, మండలాల అధ్య క్షులు డాక్టర్ వీరమల రాము, గట్ల రవీందర్, ఎనబోతుల రాజు, కొండి రమేష్, ఆలం శ్రీనివాస్, కర్రీ శ్రీనివాస్, జయ రాయుడు, నా యకులు పద్మ, సంపత్, నాగార్జున్, మహేందర్, రాజు, ఓమర్, దిలీప్, జనార్ధన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.