26-01-2026 02:51:33 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 25(విజయక్రాంతి): తక్షణమే ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజు ల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. నిరుద్యోగుల జీవితాల్లో మార్పు వస్తదని నమ్మి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వని బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి, కాంగ్రెస్‌ని గద్దెనెక్కిస్తే... నిరుద్యోగులకు మొండి చేయి చూపిస్తోందని ఆగ్రహించారు. తక్షణమే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 31న ఇందిరాపార్కు వద్ద నిరుద్యోగ గర్జన నిర్వహిస్తున్నామన్నారు.
ఆదివారం హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యా ర్థి జేఏసీ ఆధ్వర్యంలో నిరుద్యోగ సింహగర్జన వాల్‌పోస్టర్‌ను విద్యార్థి జేఏసీ నేత మోతిలాల్ నాయక్ గుజ్జ కృష్ణతో కలిసి శ్రీనివాస్‌గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిన రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్1, గ్రూప్2, గ్రూప్3, డీఎస్సీ, ఇంజనీర్ తదితర పోస్టుల్లో భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌లు విడుదల చేయక పోవడం చాలా అన్యాయం అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి తక్షణమే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చే యాలని డిమాండ్ చేస్తూ.. ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ, నిరుద్యోగ జేఏసీ సంఘాలు ఈనెల 31న నిరుద్యోగ సింహగర్జన నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మని మంజరి సాగర్, వినోద్, అనిల్, ఆకాష్, బాషా, తండు రమేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.