26-01-2026 02:51:19 AM
అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు
ఘట్ కేసర్, జనవరి 25 (విజయక్రాంతి): ఘట్ కేసర్ పట్టణంలో ఘట్టుమైసమ్మ అమ్మవారి జాతరను పట్టణ ప్రజలు ఆదివారం భక్తి శ్రద్దలతో అత్యంత వైభవంగా జరుపుకున్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన జాతరలో ఉదయం నుంచే ప్రజలు తమ బంధుమిత్రులతో కలసి ఘట్టు మైసమ్మ దేవాలయ ఆవరణలో ప్రత్యేక గూడారాలు ఏర్పాటు చేసుకొని అమ్మవారికి తమ మొక్కులు తీర్చుకున్నారు.
మహిళలు నైవేద్యంతో కూడిన బోనాలతో డప్పు వాయిద్యాలు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తులు వెంటరాగా ఆలయానికి చేరుకొని నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన రంగం కార్యక్రమంలో భక్తులకు భవిష్యవాణిని వినిపించారు. జాతర సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో పిల్లల ఆటబొమ్మలు, తినుబండారాల దుకాణాలు అనేకం వెలిశాయి.
వేలాది మంది భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కంభం అనిల్ రెడ్డి, మేడ్చల్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, బిబ్లాక్ అద్యక్షులు వేముల మహేష్ గౌడ్, ఘట్ కేసర్, పోచారం మున్సిపల్స్ మాజీ చైర్మన్ లు ముల్లి పావని జంగయ్యయాదవ్, బోయపల్లి కొండల్ రెడ్డి, వైస్ చైర్మన్లు పలుగుల మాధవరెడ్డి, ననావత్ రెడ్డి నాయక్, రైతు సేవ సహకార సంఘం చైర్మన్ సింగిరెడ్డి రామిరెడ్డి, మాజీ చైర్మన్ సారా శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరియాదవ్,
మాజీ కౌన్సిలర్లు, , బిబ్లాక్ బిబ్లాక్ మాజీ ఎంపీపీలు బండారి శ్రీనివాస్ గౌడ్, ఏనుగు సుదర్శన్ రెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు మామిళ్ళ ముత్యాల్ యాదవ్, ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కమిటీ డైరెక్టర్ సగ్గు అనీత శ్రీనివాస్, కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి దేవస్థానం ధర్మకర్త మెరుగు నరేష్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవరెడ్డి, బీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పొన్నాల కొండల్ రెడ్డి, ఆయా పార్టీల నాయకులు కుమ్మిడి రాఘవరెడ్డి, కొంతం అంజి రెడ్డి, బొక్క ప్రభా కర్ రెడ్డి, సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, బొక్క విష్ణువర్ధన్ రెడ్డి, ననావత్ సురేష్ నాయక్, రాజేశ్వర్ రెడ్డి, కే.ఎం. రెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు