26-01-2026 02:53:48 AM
కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
రంగారెడ్డి, జనవరి 25( విజయక్రాంతి ) 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత దేశంలో విభిన్న సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలు ఉన్నప్పటికి మనమందరం భారతీయులమన్నారు.
ఏ దేశంలో లేని విధంగా భారత రాజ్యాంగం మన దేశంలో పౌరులకు స్వేచ్ఛను స్వాతంత్రాన్ని కల్పించిందని ఏ ఎన్నికలైనా కూడా ఓటు ప్రధాన పాత్ర పోషిస్తదని, కాబట్టి పౌరులందరూ తమకు నచ్చిన, సమాజానికి మేలు చేసే వ్యక్తులను ఎన్నుకోవడానికి ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని, ఓటు హక్కు ప్రాధాన్యతను ఇతరులకు తెలియజేయాలని కోరారు.
18 ఏళ్ళు వయస్సు నిండిన ప్రతి ఒక్కరూ విధిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓటరుగా నమోదు చేసుక్కున్న ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువత బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిడిలకు లొంగకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ సందర్బంగా సీనియర్ సిటిజనలైన సి.కృష్ణారెడ్డి, చౌదరి, మధుసూదన్ రావు, ఎం.సత్తయ్య గౌడ్, పి.ప్రతాప్ రెడ్డి లను కలెక్టర్ సత్కరించారు. వ్యాస రచన పోటీలో పాల్గొన్న విజేతలుగా నిలచిన విద్యార్థులైన టి.శ్రీవల్లి, (10వ తరగతి విద్యార్థి TGMS, నేదునూర్), కె.అభినయ, (10వ తరగతి ZPHS, కొంగర కలాన్), ఎన్.రఘుపతి (10వ తరగతి ZPHS(Boys) తుక్కుగూడ) ఎన్.సౌమ్య (10వ తరగతి ZPHS, శేరిగూడ), కె.అక్ష (10వ తరగతి TGMS, మహేశ్వరం), జి.శ్రీనేత్ర (10వ తరగతి ZPHS, రవిర్యాల), ఎం.సునిల్ (10వ తరగతి ZPHS, రాగన్నగూడ),
పి.శ్రీజ (10వ తరగతి KGVB, మహేశ్వరం), ఎం.శృతి (10వ తరగతి KGVB, యాచారం), వి.హర్షవర్ధన్ (10వ తరగతి ZPHS, సాహెబ్ నగర్), జి.అలంకృత (10వ తరగతి TGMS బొంగులూర్), కె.సింధు (9వ తరగతి KGVB, మంచాల్), ఎన్.అనిత (10వ తరగతి KGVB, ఇబ్రహీంపట్నం), కె.శశాంక్ (10వ తరగతి TGMS, గున్ గల్), ఎండి.ఇంరాణా (10వ తరగతి TGMS, ఆరుట్ల) బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఓటు హక్కు పై ప్రతిజ్ఞ చేయించి ముగ్గుల పోటీ లో పాల్గొన్న వారికి కలెక్టర్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.చంద్రా రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, జిల్లా గ్రామీణాభివృద్ది పిడి మరియు స్వీప్ నోడల్ అధికారి శ్రీలత, అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్లలో ఓటరు జాతీయ దినోత్సవం
చేవెళ్ళ జనవరి 25(విజయక్రాంతి): చేవెళ్లలో 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తహసిల్దార్ ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో మున్సిపల్ కేంద్రంలోని ప్రధాన కూడలిలలో ర్యాలీ తీసి మానవ హారం నిర్వహించారు. కులం మతం జాతి వివక్ష లేకుండా స్వచ్ఛందంగా ప్రజాస్వామ్యం కోసం భారత పౌరునిగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటానని దేశ ఔన్నత్యానికి చాటి దేశ పురోగతికి సహకరిస్తానని ప్రతిజ్ఞ చేయించారు.
చేవెళ్ల పురపాలక సంఘం కమిషనర్ వెంకటేశం సిబ్బందితో కలిసి ఆర్డీవో కార్యాలయం ముందు ఓటర్లను సన్మానించారు. ఈ కార్యక్రమం తెల్ల టీ షర్టు ధరించి ఎలక్షన్ సంఘం సింబల్ ఉన్న బ్యానర్ ప్రదర్శించారు. జాతీయ ఓటర్ దినోత్సవంలో వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ప్రతిజ్ఞ చేశారు.
ఓటు హక్కును నిజాయితీగా వినియోగించుకోవాలి: ఆర్డీఓ
కందుకూరు, జనవరి 25 (విజయక్రాంతి): ఓటు హక్కును ప్రతి ఒక్కరు నిజాయితీగా వినియోగించుకోవాలి కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్ది పేర్కొన్నారు.ఆదివారం 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్బంగా ఓటర్లను చైతన్య పరిచేందుకు ఆర్డీఓ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఎన్నికల్లో ఓటు ఉన్నవారు నిజాయితీగా ఓటు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కందుకూరు, మహేశ్వరం, సరూర్నగర్, బాలాపూర్, తహాశీల్దారులు కె.గోపాల్, అప్పల నాయుడు,వేణుగోపాల్, ఇందిర, సరూర్ నగర్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రావు,ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ తాజద్దీన్, కందుకూరు డిప్యూటీ తహసీల్దార్ శేఖర్, బిఎల్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.