02-10-2025 12:03:03 AM
మహబూబాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా ఆర్యవైశ్య సంఘం భవనంలో ఏర్పాటు చేసిన దుర్గామాత కు 5000 రూపాయల విలువైన నోట్లతో రూపొందించిన హారం 70,116 రూపా యలకు రామడుగు ధర్మాచారి వేలం పాటలో దక్కించుకున్నారు.
5000 రూపా యల విలువైన కరెన్సీ నోట్లతో భక్తులు అమ్మవారికి హారం సమర్పించగా, తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న హారానికి బుధవారం వేలంపాట నిర్వహిం చారు. ఈ సందర్భంగా ధర్మచారి 70,116 రూపాయలకు వేలంపాటలో అమ్మవారి హారాన్ని పొందారు.