12-11-2025 12:00:00 AM
హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ప్రత్యేక విధానాన్ని విద్యాకమిషన్ తేనుంది. యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వ హించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయనుం ది. యూనివర్సిటీల్లో పదుల సంఖ్యలో విద్యా ర్థి సంఘాలు, జేఏసీలు ఉన్నాయి. ఎవరికి వా రు, ఎవరి ఎజెండా వారికి అన్నట్లుగా పలు సంఘాలు, జేఏసీ పనిచేస్తున్నాయనే అంశం తెలంగాణ విద్యాకమిషన్ దృష్టికి వచ్చింది.
దీంతో పాటు వర్సిటీల్లో తరచూ ఆందోళనలు, నిరసనలు చేయడం, వర్సిటీ పరిపాలనకు ఆటంకాలు కల్గిస్తారనే ఉద్దేశంతో ఏదో ఒక సం ఘం మాత్రమే విద్యార్థుల తరుపున సమస్య లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తుం ది. యూనివర్సిటీల్లోని వీసీలు, రిజిస్ట్రార్లు, అధికారులను కలిసి సమస్యలు చెప్పుకోవడానికి ఏదో ఒక సంఘం, జేఏసీ పేరుతో నాయ కులు కలుస్తుండటం, ఒత్తిడి తీసుకురావడం అధికారులకు తలనొప్పిగా మారుతోంది.
ప్ర స్తుతం రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పే రున్న విద్యార్థి సంఘాలు కాకుండా పలు కుల సంఘాలు, నిరుద్యోగ సంఘాల పేరుతోనూ అనేక విద్యార్థి సంఘాలు ఏర్పాటవుతున్నట్లు విద్యాకమిషన్ దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో నే యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. ఎన్నికల్లో గెలిచిన విద్యార్థి సంఘ మే వర్సిటీల్లోని విద్యార్థి సమస్యలపై అధికారులకు ప్రాతినిథ్యం వహించేలా, వారి సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా కమిషన్ సూచనలు చేయనుంది.
దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లోని వర్సిటీల్లో విద్యా ర్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనూ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇదే తరహాలో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఎన్నికలు నిర్వహించేలా ప్రతిపాదనలు పంపనుంది. అలాగే వర్సిటీల్లోని నాన్ బోర్డర్ విద్యా ర్థుల సమస్యపై కూడా విద్యాకమిషన్ పలు సిఫార్సులు చేయనున్నది.
వియాత్నం తరహాలో..
విద్యాశాఖపై సమగ్ర నివేదికను తెలంగాణ విద్యాశాఖ సిద్ధం చేస్తోంది. పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీల వరకు పలు కీలకమైన సిఫార్సులను చేయనుంది. నెల రోజుల్లో ప్రభుత్వానికి నివేదికను ఇవ్వనుంది. ఇటీవల వియా త్నం పర్యటనకు వెళ్లి వచ్చిన విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అక్కడి పాఠశాలల్లో అమలు చేస్తున్న నూతన విద్యావిధానాలను మనదగ్గర కూడా అమలు చేసేలా నివేదికను రూపొందిస్తున్నారు.
ప్రతి మండలానికి ఒక పె ద్ద స్కూల్ ఉండేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నారు. ఆయా స్కూళ్లలో విశాలమైన ప్రాంగణం, తరగతి గదుదలు, ప్రహరీ , ఆట స్థలం, డిజిటల్ తరగతులు, ఇంగ్లిష్ మీడియం విద్యాబోధన, వెయ్యి మంది విద్యార్థులు, సరిపడా ఉపాధ్యాయులు లాంటి అన్ని వసతులు ఉండేలా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నివేదించనున్నారు.
దీంతోపాటు యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల ఖాళీలను భర్తీ చేయటం, వి ద్యాశాఖకు భారీగా నిధులు కేటాయించడం లాంటి సిఫార్సులు చేయనుంది. ఇప్పటికే రా ష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ విద్యాకమిషన్ మి డ్ డే మీల్స్ స్కీం అమలు, ప్రైవేట్ స్కూల్స్, జూనియర్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ, తె లంగాణ పబ్లిక్ స్కూల్‌తో పాటు పలు అంశాలపైన ప్రభుత్వానికి నివేదికలను సమ ర్పించింది.
విద్యకు 15 శాతం నిధులు కేటాయించాలి
విద్యాశాఖపై మొత్తం సమగ్ర నివేదికను రూపొందించే పనిలో కమిషన్ నిమగ్నమైంది. నెల రోజు ల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం. అందుకు సం బంధించిన రీసెర్చ్ చేసి, రిపోర్టు సిద్ధం చేస్తున్నాం. విద్యకు రాష్ట్ర బడ్జెట్‌లో 15 శాతానికి తగ్గకుండా నిధు లు కేటాయించాలని నివేదికలో ప్రభుత్వానికి సూచిస్తాం. డ్రగ్స్, గంజాయిపై విద్యార్థుల్లో చైతన్యం తీసుకొచ్చేలా అవగాహన సదస్సును ఏర్పాటు చే యాల్సిన అవసరం ఉంది. విద్యార్థి సం ఘాలకు ఎన్నికలు నిర్వహిస్తే వర్సిటీ పరిపాలన బాగుంటుంది. వీటితోపా టు మరికొన్ని సిఫార్సులను ప్రభుత్వానికి చేస్తాం.
ఆకునూరి మురళి,
విద్యా కమిషన్ చైర్మన్