30-07-2024 03:51:20 PM
తిరువనంతపురం: కేరళ వయనాడ్ లో త్రీవ విషాదం జరిగింది. భారీ వర్షాలతో వయనాడ్ జిల్లాలో వేర్వేరు చోట్ల కొండచరియలు విరిగిపడాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు దాదాపు 70 మంది మృతి చెందగా, మరో 116 మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వయనాడ్ జిల్లాలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో మంగళవారం, బుధవారం సంతాప దినాలను పాటించనున్నట్లు రాష్ట్రం ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.