calender_icon.png 15 August, 2025 | 2:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ రహదారిపై వాగునీళ్లు

15-08-2025 12:28:59 AM

పరిశీలించిన ఎమ్మెల్యే, ఎస్పీ

ఇబ్బంది పడ్డ వాహనదారులు

భూత్పూర్, ఆగస్టు 14 : మున్సిపాలిటీ పరిధిలోని షేర్ పల్లి (బి) గ్రామంలో ఉన్న కోమటికుంట చెరువు తెల్లవారుజామున అలుగు పారి పెద్ద ఎత్తున జాతీయ రహదారి 44 నీరు రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, ఎస్పీ లు  జాతీయ రహదారిపై వస్తున్న నీళ్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాహనదారులు వెళ్లే మార్గాలలో చూసి వాహనాలను నడిపించాలని అన్నారు. వర్షాలు పడుతున్న సందర్భంగా ప్రమాదాలు జరగకుండా వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు తెల్లవారుజామున నుంచే చర్యలు చేపడుతున్నారు.

అదేవిధంగా దివిటిపల్లి జాతీయ రహదారి నుంచి ఐటి ఆఫీసుకు వెళ్లే మార్గంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి దివిటిపల్లి చెరువు అలుగు పారింది. ఒక్కసారిగా నీళ్లు రోడ్డుపైకి రావడంతో అమర్ రాజా బ్యాటరీ కంపెనీ బస్సు ఆ మార్గంలో వెళుతున్న సమయంలో ఒక్కసారిగా రోడ్డు కుంగి బస్సు ముందల భాగం నెలలో పడిపోయింది. బస్సులో ఉన్న కొంతమంది ఉద్యోగస్తులు అప్రమతమై బస్సు ఎమర్జెన్సీ డోర్ ద్వారా సురక్షితంగా బయటికి వచ్చారు.

కొంతమంది ఉద్యోగస్తులకు స్వల్ప గాయాలు అవ్వగా వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు జాతీయ రహదారిపై పారుతున్న వరద నీటిని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, తాసిల్దార్ కిషన్ నాయక్, మున్సిపల్ కమిషనర్ నూరుల్ నజీబ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేశవరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లిక్కి నవీన్ గౌడ్,  సిఐ రామకృష్ణ, ఎస్త్స్ర చంద్రశేఖర్ పాటు తదితరులు ఉన్నారు.