calender_icon.png 15 August, 2025 | 2:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేత

15-08-2025 12:29:00 AM

సంస్థాన్ నారాయణపూర్, ఆగస్టు 14 (విజయ క్రాంతి): నారాయణపురం సిపిఐ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి  మంజూరైన చెక్కులను ముగ్గురు లబ్ధిదారులకు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సత్యం మాట్లాడుతూ పేద ప్రజలు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స చేసుకున్న తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొంత ఉపశమనం పొందవచ్చని అన్నారు.

రాజకీయాలకు అతీతంగా ఆపదలో ఉన్నవారికి తప్పక సాయం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చన గోని గాలయ్య,కే.శ్రీనివాస్,తీర్పారి వెంకటేశ్వర్లు,మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్, కలకొండ సంజీవ, వీరమల్ల యాదయ్య, పల్లె మల్లారెడ్డి, పందుల యాదగిరి,  గొల్లూరి సత్యనారాయణ, కొప్పు సుధాకర్,  పాక జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.