08-08-2025 12:48:20 AM
బీపీ నేత, మాజీ మేయర్ సునీల్ రావు
కరీంనగర్, ఆగస్టు 7 (విజయ క్రాంతి): రాబోయే స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసేలా చూడాలని , పార్టీ సూచన మేరకు ఆగస్టు 10 నుండి 15 వరకు చేపట్టాల్సిన తిరంగా యాత్ర ప్రోగ్రాంలను సక్సెస్ చేయాలని బిజెపి నాయకులు, మాజీ మేయర్ సునీల్ రావు పిలుపునిచ్చారు. గురువారం బిజెపి ఈస్ట్ జోన్ ఆధ్వర్యంలో తిరంగా అభయాన్ సన్నాక సమావేశం నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రజలతో కలిసి తిరంగా యాత్ర కార్యక్రమాలు నిర్వహించాలని, దేశభక్తి పూరిత కార్యక్రమాలు చేపట్టేలా ప్రోగ్రాములు నిర్వహిస్తూ , దేశ సమైక్యత సమగ్రత కోసం ప్రతిజ్ఞ చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర, ఈస్ట్ జోన్ అధ్యక్షులు అవదుర్తి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మాసం గణేష్ , మాజీ కార్పొరేటర్ లెక్కల వేణు , పాశం తిరుపతి, రాజు, బెల్లం నరేందర్, సాగర్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.