calender_icon.png 19 August, 2025 | 1:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధానితో ఉపరాష్ట్రపతి అభ్యర్థి సమావేశం

19-08-2025 12:17:53 AM

ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్డీయే కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సీపీ రాధాకృష్ణన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఏండ్లుగా వివిధ రంగాల్లో సేవలందిస్తున్న ఆయన అనుభవం దేశాన్ని సుసంపన్నం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడుకు చెందిన సీనియర్ నేత, ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్‌కు బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అవకాశం కల్పించింది. సీపీ రాధాకృష్ణన్ ఆర్‌ఎస్‌ఎస్‌లో కూడా విధులు నిర్వర్తించారు. రెండు సార్లు లోక్‌సభ ఎంపీగా గెలిచిన దక్షిణాది నేత కావడం ఆయన స్పెషాలిటీ.