14-08-2024 12:30:00 AM
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ సమస్యకైనా కమిటీలను నియమించడం పరిపాటైంది. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలు, ధరణి అవకతవకలు, కొత్త రేషన్ కార్డుల జారీ.. ఇలా ప్రతి దానికి మంత్రుల కమిటీలను నియమించడం ద్వారా సమస్యలపై కాలయాపన చేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇంతకీ ఇన్ని కమిటీల్లో ఏ ఒక్క కమిటీ అయినా నివేదిక ఇచ్చిందా అంటే అదీ లేదు.
దీంతో కొత్త ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఉచిత బస్సు ప్రయాణం లాంటి ఒకటీ అరా తప్పించి, ఏ ఒక్క ముఖ్యహామీ అమలు కాలేదు. పింఛన్లు పెంచుతామన్న హామీ ఊసే లేదు. అలాగే, గృహలక్ష్మిపథకం అమలును మరిచారు. రాజకీయాలను కాస్త పక్కన పెట్టి పాలనపైన, ప్రజా సమస్యల పరిష్కారంపైన దృష్టి పెట్టాలి.
రాజేశం గౌడ్, హనుమకొండ