18-11-2025 12:00:00 AM
అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ
ఖమ్మం, నవంబరు 17 (విజయక్రాంతి): ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలు పై మండల ప్రత్యేక అధికారులు దృష్టి సా రించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ జిల్లా ఆదేశించారు.కలెక్టరేట్ స మావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం అనంతరం ప్ర భుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై మండల ప్రత్యేక అధికారులు ప్రతి శుక్రవారం చేపట్టిన తనిఖీ సంబంధిత అంశాలపై ఆమె అద నపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ ప్రతి మండల పరిధిలో ఎవ్రీ చైల్ రీడ్స్ కార్యక్రమం అమలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థల నిర్వహణ, ధాన్యం కొనుగోలు కేం ద్రాలను మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు మండల పరిధిలో కట్టుదిట్టంగా అమలు జరిగేలా మండల ప్రత్యేక అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. మండల పరిధిలో ప్రతిపాదించిన ధా న్యం కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్రారంభించాలని, ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద అవసరమైన మేర వసతులు ఉన్నాయో లేదో చెక్ చేయాలని, నాణ్యమైన ధాన్యం కొనుగోలు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు జరిగేలా పర్యవేక్షణ ఉండాలని తెలి పారు.
మండల పరిధిలోని ప్రాథమిక పాఠశాలల్లో ఎవ్రీ చైల్ రీడ్ కార్యక్రమం అమలు తీరును నిర్దిష్టంగా పరిశీలించాలని అన్నారు. విద్యా సంస్థలను తనిఖీ చేస్తూ అక్కడ పారిశుధ్య నిర్వహణ, భోజన నాణ్యత, పిల్లలకు అవసరమైన వసతుల కల్పన వంటి అంశాలను పరిశీలించి నివేదిక అందించాలని అ న్నారు. ఈ సమావేశంలో డీఆర్డిఓ సన్యాసయ్య, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.