18-11-2025 12:00:00 AM
బూర్గంపాడు, నవంబర్ 17 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని వ్యవసాయ మా ర్కెట్ యార్డ్ నందు పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు అందుబా టులోనే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, నిబంధనల మేరకు ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని కోరారు.రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, సంఘ సెక్రటరీ, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.