calender_icon.png 13 August, 2025 | 6:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదాయాలపైనే శ్రద్ధ.. సౌకర్యాలపై అశ్రద్ధ!

13-08-2025 12:00:00 AM

  1. నిలువ నీడేదీ..బస్ షెల్టర్లను మరిచారా..?
  2. ఎండకు ఎండుడే.. వానకు తడుసుడే 
  3. రోడ్లపై.. దుకాణాల ఎదుట నిరీక్షణ
  4. నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే పరిస్థితి
  5. ప్రయాణికుల అవస్థలు
  6. కొత్త బస్టాండు నిర్మాణం అంతేనా..?

మణుగూరు, ఆగస్టు12 (విజయ క్రాంతి): వందల సంఖ్యలో ఆర్టీసీ బస్సుల ట్రిప్పులు.. వేల సంఖ్య లో ప్రయాణికుల రాకపోకలు.. కానీ మండల కేంద్రంతో పాటు, పినపాక, అశ్వాపురంలలో ప్రయాణికుల కోసం ఒక్క బస్ షెల్టర్ అయినా కనిపించదు.

బస్సు షెల్ట ర్ లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నా రు. నిలువ నీడ లేక పాట్లు పడుతున్నారు. ఆర్టీసీ అధికారుల కుఆదాయాల పై ఉన్న శ్రద్ధ.. సౌకర్యాల పై కనిపించడం లేదని, ప్ర యాణికులుమండిపడుతున్నారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసిన బస్ షెల్టర్ లేక ప్ర యాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

బ’స్టాప్’ షెల్టర్లు ఏవి..?

పారిశ్రామిక ప్రాంతమైన మణుగూరు తో పాటు అశ్వాపురం, పినపాక,కరకగూడెం మండల కేంద్ర లలో స్వచ్ఛంద సంస్థలు ఏ ర్పాటు చేసిన బసెల్టర్ లను రోడ్డు విస్తరణ పనులలో భాగంగా కూల్చి మూడేళ్లు గడిచింది. అప్పటి నుంచి ఇప్పటివరకు తాత్కాలి క బసెషెల్టర్లను ఏర్పాటుచేయకపోవడంతో ప్రయాణికులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన మార్గాలతో పాటుగ్రా మాలకు వెళ్లే రూట్లలోనూ బసెల్టర్లు లేక ఎం డ, వానలలోనే నిరీక్షిస్తున్నారు.

నిత్యం ప్ర జలు, కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, హైదరాబాద్, విజయవాడ వంటి ప్రాంతా లకు వెళ్లే బస్సుల కోసం రోడ్డుపై ఎండలో, వానలో నిలబడాల్సిందే. సమీపంలో ఉన్న దుకాణాల ముందు నిలబడితే వారితో చీవాట్లు తినాల్సి వస్తోందనివాపోతున్నారు. నిలువ నీడ లేక పాట్లు పడుతున్నారు. బస్సుల కోసం రోడ్డుపైనే పడిగాపులు కాస్తున్నారు. బస్సుల కోసం చెట్ల కింద, దుకాణాల ముం దు నిలబడాల్సివస్తోంది.

ప్రయాణికుల అవస్థలు

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సాగించే వారి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. అయినా సంబంధిత అధికారులు కనీస ప్రయాణికులకు కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయక పోవడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నా రు. గతంలో లయన్స్. రోటరీక్లబ్,వాసవి క్లబ్ వంటి సంస్థలు బస్ షెల్టర్ల నిర్మాణాలకు ముందు కొచ్చేవి. కానీ, ఈ మధ్య అలాంటి కార్యక్రమాలను ఎవరూ చేపట్టక పోవడం కూడా సమస్య తీవ్రతకు కారణంగా చెప్పుకోవచ్చు.

శంకుస్థాపనకే పరిమితం 

మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు కలగానే మిగిలింది. నేతల హామీలకే పరిమితమై.. ప్రతిపా దనల్లోనే నిలిచిం ది. నాలుగు ప్లాట్ పామ్ లతో సురక్ష బస్ స్టాండ్ ద్వారా ప్రయాణికులకు సేవలు అం దుతున్నాయి.

ఆర్టీసీ డిపో వద్ద నాటి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రూ 5. కోట్లతో నూతన బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నాటి నుండి నేటి వరకు నిర్మాణం శిలా ఫలకానికే పరిమితమైంది. ఇప్పటి కైనా ప్రజా ప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు చొర వ తీసుకొని బస్ షెల్టర్లను, నూతన బస్టాండ్ ఏర్పాటుకు కృషి చేయాలని, స్వచ్ఛంద సంస్థలు బస్ షె ల్టర్ల నిర్మాణాలకు ము ందుకు వచ్చి ప్రయాణికుల కష్టాలను తీర్చాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.