calender_icon.png 11 September, 2025 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించాలి

11-09-2025 01:15:07 AM

  1. ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల అధికారులతో సమీక్ష

రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి) : స అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ, ఆదా య వనరులను పెంపొందించుకునే దిశగా వినూత్న ఆలోచనలు,పద్ధతులతో స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో బుధవారం ఉ మ్మడి జిల్లా స్థానిక సంస్థల అధికారులతో రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యులు  ఏం.రమేష్ , సంకిపల్లి సుధీర్ రెడ్డిలతో కలిసి చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సమీక్ష నిర్వహించారు.

మ హబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి,నాగర్ కర్నూల్ కలెక్టర్ బధావత్ సం తోష్,వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,గ ద్వాల కలెక్టర్ బి. ఎం సంతోష్,నారాయణ పేట అదనపు కలెక్టర్ రెవెన్యూ లు  జిల్లాల వారీగా ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల పనితీరు గురించి చైర్మన్ కు వివరించారు.

ము న్సిపల్ పట్టణాలు, గ్రామ పంచాయతీలలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపా లు, తడి, పొడి చెత్త సేకరణ, పచ్చదనం పెం పు, పన్ను వసూళ్లు,స్వయం ఉపాధి పథకాల అమలు, ప్రజల జీవన ప్రమాణాల పెంపు కోసం కొనసాగుతున్న కార్యక్రమాలు, గ్రాం ట్స్ రూపంలో సమకూరుతున్న ఆదాయం, ఇతర మార్గాల ద్వారా స్థానిక సంస్థలకు అం దుతున్న రాబడి తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించా రు.

స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా విడుదల అయిన నిధులు, వాటి వెచ్చింపు వివరాల ను గణాంకాల ద్వారా వెల్లడించారు.  ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ, గ్రామ స్వ రాజ్యమే దేశ స్వరాజ్యమని గుర్తు చేశారు. రా ష్ట్ర ప్రభుత్వం మొట్ట మొదటగా రాష్ట్ర పైనా న్స్ కమీషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

స్థానిక సంస్థలు స్వయం పాలన సంస్థలు అని, స్థానిక సంస్థలు పరిపుష్టం చెంది ప్రజలకు  సమర్థంగా వసతులు, సేవలు కల్పిం చాలని, ఇందుకు స్థానిక సంస్థల అధికారు లు మంచి అవకాశంగా బావించి అంకిత భా వంతో సేవలు అందించాలని కోరారు. స మాజ మార్పుకు ,సమాజ చైతన్యం కు  కృషి చేయాలని అన్నారు. ఘన,ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ  పద్ధతులు అవలంబించి మ హబూబ్ నగర్ నగరపాలక సంస్థ ఆదర్శం గా రూపొందాలని సూచించారు.

ఘన,ద్రవ వ్యర్థాల నిర్వహణలో మధ్య ప్రదేశ్ ఇండోర్ లో అవలంబిస్తున్న ఉత్తమ పద్ధతులు ఫైనా న్స్ కమిషన్ అధ్యయనం చేస్తుందని తెలిపా రు. గ్రామ పంచాయతీ లు తడి,పొడి చెత్త ద్వారా వర్మీ కంపోస్ట్ తయారు చేసి మహిళా సంఘాల ద్వారా విక్రయించ వచ్చని, తద్వా రా ఆదాయంతో పాటు,భూ సారం తగ్గుతుందని అన్నారు. చికెన్ వ్యర్థాలు మూడు, నాలుగు పంచాయతీ లు కలిపి క్లస్టర్ లాగా టెండర్ వేసి వచ్చిన ఆదాయం ను జనాభా ఆధారంగా పంచుకోవచ్చని తెలిపారు. సో లార్ ఎనర్జీ ద్వారా కూడా ఖర్చు తగ్గించవచ్చని అన్నారు.

ఆర్థిక అసమానతలు, సామా జిక వ్యత్యాసాలు సమసిపోయి, మానవ సం పద, వారి శక్తియుక్తులు సమాజానికి ఉపయోగపడేలా కృషి జరగాలన్నారు. ఈ దిశ గా ప్రజలకు, ప్రభుత్వానికి కమిషన్ వారధిగా నిలుస్తూ సామాజిక అభ్యున్నతి కోసం చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఫైనాన్స్ కమిషన్ సూచనలు చేస్తుందని తెలిపారు.

ఈ సమావేశం లో రాష్ట ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్  జిల్లెల చిన్నా రెడ్డి, ఎమ్మెల్సీ కుచుకుల్ల దామోదర్ రెడ్డి,కమీషన్ సభ్యులుసంకిపల్లి సుధీర్ రెడ్డి, రాష్ట  ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీ కాత్యాయని, మహబూబ్ నగర్  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, నాగర్ కర్నూల్ స్థానిక సంస్థల కలెక్టర్ దేవ సహాయం, వనపర్తి  స్థానిక సంస్థలఅదనపు కలెక్టర్ యాదయ్య ,

గద్వాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ నర్సింగ్ రావు,ఉమ్మడి జిల్లా జడ్.పి.సి ఈ ఓ.లు,డి.పి.ఓ.లు,డివిజనల్ పంచాయతీ అధికారులు,మున్సిపల్ కమిషనర్ లు, ఎం.పి.డి. ఓ.లు, ఎం.పి.ఓ.లు ,పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.